IND VS AUS 3rd Test: మూడో టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా - ఆస్ట్రేలియా బ్యాటింగ్ - జట్టు నుంచి అశ్విన్ ఔట్
14 December 2024, 5:47 IST
IND VS AUS 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. రెండో టెస్ట్ ఓటమి నేపథ్యంలో తుది జట్టులో టీమిండియా రెండో మార్పులు చేసింది. అశ్విన్, హర్షిత్ రాణా స్థానాల్లో జడేజా, ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
IND VS AUS 3rd Test: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకున్నది. గబ్బా పిచ్‌పై గత ఏడు టెస్టుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలవడం టీమిండియాకు కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
రెండు మార్పులు...
రెండో టెస్ట్‌లో ఓటమి కారణంగా గబ్బా టెస్ట్‌లో తుది జట్టులో టీమిండియా రెండు మార్పులు చేసింది. అశ్విన్ బదులు జట్టులోకి మరో సీనియర్ స్పిన్నర్ జడేజా వచ్చాడు. హర్షిత్‌రాణాను పక్కనపెట్టి ఆకాశ్‌దీప్‌అవకాశం ఇచ్చారు. నితీష్‌రెడ్డిని జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించడంతో అతడికి సెలెక్టర్లు మరో ఛాన్స్ ఇచ్చారు.
కోహ్లి...రోహిత్‌పైనే దృష్టి...
గబ్బా టెస్ట్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ ఎలా ఆడుతారన్నది ఆసక్తికరంగా మారింది. తొలి టెస్ట్‌లో సెంచరీతో అదరగొట్టిన కోహ్లి...రెండు టెస్ట్‌లో ఆ ఫామ్ కొనసాగించలేకపోయాడు. మరోవైపు ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగిన రోహిత్ కూడా దారుణంగా నిరాశపరిచాడు. వీరిద్దరు రాణించడం జట్టుకు కీలకంగా మారింది.
మూడో టెస్ట్‌లోనూ రోహిత్ ఆరో స్థానంలోనే బ్యాటింగ్ దిగనున్నట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించబోతున్నారు.
బోలాండ్ స్థానంలో...
మరోవైపు ఆస్ట్రేలియా కూడా తుది జట్టులో ఓ మార్పు చేసింది. బోలాండ్‌ను పక్కనపెట్టి జోస్ హేజిల్‌వుడ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. గబ్బా స్టేడియంలో టీమిండియా రికార్డులు మాత్రం గొప్పగా లేవు. ఈ పిచ్‌పై ఇప్పటివరకు ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఐదింటిలో ఓడిపోయింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.
సిరీస్ సమం...
కాగా టెస్ట్ సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమంగా ఉంది. ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించగా...రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా గెలిచింది.
టీమిండియా తుది జట్టు ఇదే...
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్
ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే
ఉస్మాన్ ఖవాజా, స్వీనీ, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, హేజిల్‌వుడ్