తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 3rd Test: గ‌బ్బా టెస్ట్‌లో బుమ్రా ఎటాక్ - సిరాజ్‌కు గాయం - పంత్ రికార్డ్‌

IND vs AUS 3rd Test: గ‌బ్బా టెస్ట్‌లో బుమ్రా ఎటాక్ - సిరాజ్‌కు గాయం - పంత్ రికార్డ్‌

15 December 2024, 9:16 IST

google News
  • IND vs AUS 3rd Test: గ‌బ్బా టెస్ట్‌లో రెండు రోజు టీమిండియా ప‌ట్టుబిగించింది. బుమ్రా జోరుతో ఆరంభంలోనే ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు మోకాలి గాయంతో పేస‌ర్ సిరాజ్ మైదానాన్ని వీడ‌టం అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పెట్టింది.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్

IND vs AUS 3rd Test: గ‌బ్బా టెస్ట్‌లో రెండో రోజు ఆస్ట్రేలియాపై భార‌త్ డామినేష‌న్ కొన‌సాగుతోంది. బుమ్రా జోరుతో ఆస్ట్రేలియా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా రెండు వికెట్లు గీయ‌గా...తెలుగు క్రికెట‌ర్ నితీష్ కుమార్ ఓ వికెట్ ద‌క్కించుకున్నాడు.

తొలిరోజు వ‌ర్షం కార‌ణంగా కేవ‌లం ప‌ద‌మూడు ఓవ‌ర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. 28 ప‌రుగుల‌తో రెండు రోజు కొన‌సాగించిన ఆస్ట్రేలియా మ‌రో మూడు ప‌రుగులు మాత్ర‌మే జోడించి ఉస్మాన్ ఖ‌వాజా వికెట్ కోల్పోయింది.

కోహ్లి క్యాచ్ లు

బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఖ‌వాజా పెవిలియ‌న్ చేరుకున్నాడు. ఆ త‌ర్వాత ఆ త‌ర్వాత మెక్ స్వీనీని కూడా బుమ్రా బోల్తా కొట్టించాడు. 49 బాల్స్‌లో 9 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు స్వీనీ. ల‌బు షేన్‌ను నితీష్ ఔట్ చేశాడు. స్వీనీ, ల‌బుషేన్ క్యాచ్‌ల‌ను కోహ్లి ప‌ట్టాడు.

ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 51 ఓవ‌ర్ల‌లోమూడు వికెట్లు న‌ష్ట‌పోయి 132 ప‌రుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 36 , స్టీవ్ స్మిత్ 35 ర‌న్స్‌తో క్రీజులో ఉన్నారు.

సిరాజ్‌కు గాయం...

గ‌బ్బా టెస్ట్‌లో సిరాజ్ గాయ‌ప‌డ్డాడు. 37వ ఓవ‌ర్‌లో రెండు బాల్స్ మాత్ర‌మే వేసిన సిరాజ్ మోకాలి గాయంతో మైదానాన్ని వీడాడు. గాయంతో న‌డ‌వ‌లేక‌పోవ‌డంతో వైద్య స‌హాయం తీసుకున్నాడు. అయినా న‌డ‌వ‌డానికి ఇబ్బంది ప‌డ‌టంతో డ్రెసింగ్స్‌రూమ్‌కు వెళ్లిపోయాడు. సిరాజ్‌ బ‌దులుగా ఆకాష్ దీప్ ఆ ఓవ‌ర్‌ను పూర్తిచేశాడు. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికి తిరిగి సిరాజ్ మైదానంలోకి అడుగుపెట్టాడు.

పంత్ రికార్డ్‌....

గ‌బ్బా టెస్ట్‌లో పంత్ రికార్డ్ నెల‌కొల్పాడు. ఉస్మాన్ ఖ‌వాజా క్యాచ్ అందుకున్న పంత్ టెస్టుల్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 150 ఔట్‌లు సాధించిన మూడో వికెట్ కీప‌ర్‌గా నిలిచాడు. పంత్ కంటే ముందు ఈ ఘ‌న‌త‌ను స‌య్య‌ద్ కిర్మాణీ, ధోనీ మాత్ర‌మే అందుకున్నారు. కెరీర్‌లో 41 టెస్ట్‌లు ఆడిన పంత్ 135 క్యాచ్‌లు ప‌ట్టాడు. 15 స్టంపింగ్స్ చేశాడు.

ప్ర‌స్తుతం బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా 1-1తో స‌మంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌లో టీమిండియా విజ‌యం సాధించ‌గా...రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా గెలిచింది.

తదుపరి వ్యాసం