తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Eng Vs Ned World Cup 2023 Match: దంచి కొట్టిన స్టోక్స్, మలన్.. నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ భారీ స్కోరు

Eng vs Ned World Cup 2023 Match: దంచి కొట్టిన స్టోక్స్, మలన్.. నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ భారీ స్కోరు

Hari Prasad S HT Telugu

08 November 2023, 18:07 IST

    • Eng vs Ned World Cup 2023 Match: స్టోక్స్, మలన్ చెలరేగడంతో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ తరఫున వరల్డ్ కప్ లలో మూడో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు స్టోక్స్.
నెదర్లాండ్స్ బౌలర్లను చితకబాదిన బెన్ స్టోక్స్
నెదర్లాండ్స్ బౌలర్లను చితకబాదిన బెన్ స్టోక్స్ (AFP)

నెదర్లాండ్స్ బౌలర్లను చితకబాదిన బెన్ స్టోక్స్

Eng vs Ned World Cup 2023 Match: వరల్డ్ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారీ స్కోరు చేసింది. స్టోక్స్ సెంచరీ, డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 రన్స్ చేసింది. ఈ మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ లోనూ తడబడుతున్న ఇంగ్లిష్ టీమ్.. ఈ మ్యాచ్ లోనూ అలాగే వరుసగా వికెట్లు కోల్పోయినా తర్వాత కోలుకొని భారీ స్కోరు చేయగలిగింది.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

ఇంగ్లండ్ తరఫున బెన్ స్టోక్స్ 84 బంతుల్లోనే 108 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్స్ లు, 6 ఫోర్లు ఉన్నాయి. స్టోక్స్ కేవలం 78 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. వరల్డ్ కప్ లలో ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన సెంచరీ. గతంలో మోర్గాన్ 57 బంతుల్లో, బట్లర్ 75 బంతుల్లో సెంచరీలు చేశారు. ఈ రెండు సెంచరీలు 2019 వరల్డ్ కప్ లోనే వచ్చాయి.

స్టోక్స్, మలన్ మెరుపులు

నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ కు మంచి స్టార్ట్ లభించినా.. మరోసారి మిడిలార్డర్ లో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే మలన్, స్టోక్స్ ఆ టీమ్ ను ఆదుకున్నారు. ఈ టోర్నీలో మంచి ఫామ్ లో ఉన్న మలన్ 74 బంతుల్లో 87 రన్స్ చేసి రనౌటయ్యాడు. అయితే బెయిర్‌స్టో (15), రూట్ (28), బ్రూక్ (11), బట్లర్ (5), మొయిన్ అలీ (4) ఫెయిలవడంతో ఒక దశలో ఇంగ్లండ్ 192 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

ఓవైపు సహచరులంతా వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. స్టోక్స్ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి క్రిస్ వోక్స్ (45 బంతుల్లో 51) మంచి సహకారం అందించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. ఈ ఇద్దరూ ఏడో వికెట్ కు 80 బంతుల్లోనే 129 రన్స్ జోడించడం విశేషం.

స్టోక్స్ కేవలం 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరికి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతడు ఔటయ్యాడు. మిడిల్ ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటర్లను బాగానే కట్టడి చేసిన నెదర్లాండ్స్ బౌలర్లు.. చివర్లో చేతులెత్తేశారు. చివరి 10 ఓవర్లలోనే ఇంగ్లండ్ 124 రన్స్ జోడించడం విశేషం.

తదుపరి వ్యాసం