Wahab Riaz Retires: క్రికెట్‌కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి పాకిస్థాన్ స్టార్ పేస్ బౌలర్ రియాజ్
16 August 2023, 13:10 IST
- Wahab Riaz Retires: క్రికెట్‌కు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్తున్నాడు స్టార్ పాకిస్థాన్ పేస్ బౌలర్ వహాబ్ రియాజ్. 15 ఏళ్ల పాటు ఆ జట్టుకు ఆడిన రియాజ్.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
పాకిస్థాన్ పేస్ బౌలర్ వహాబ్ రియాజ్
Wahab Riaz Retires: క్రికెట్ కు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తున్నాడు మరో పాకిస్థాన్ పేస్ బౌలర్. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తాను రిటైరవుతున్నట్లు వహాబ్ రియాజ్ బుధవారం (ఆగస్ట్ 16) అనౌన్స్ చేశాడు. 15 ఏళ్ల పాటు పాకిస్థాన్ కు ఆడిన వహాబ్.. చివరిసారిగా 2020లో నేషనల్ టీమ్ కు ఆడాడు. ఈ ఏడాది జనవరిలో అతడు రాజకీయాల్లో చేరాడు.
ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తిస్థాయిలో గుడ్ బై చెప్పి మొత్తంగా రాజకీయాలపైనే సమయం గడపనున్నాడు. అయితే అతడుఫ్రాంఛైజీ క్రికెట్ లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ తరఫున వహాబ్.. 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇక టెస్టుల్లో 83 వికెట్లు, వన్డేల్లో 120 వికెట్లు, టీ20ల్లో 34 వికెట్లు తీశాడు.
2020లో పాకిస్థాన్ తరఫున ఆడిన వహాబ్ కు.. తర్వాత మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు. ఈ లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ ఈ మధ్యే పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీ తరఫున బరిలోకి దిగాడు. రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న వహాబ్.. ఈ మధ్యే పంజాబ్ ప్రావిన్స్ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా కావడం విశేషం. తన రిటైర్మెంట్ ప్రకటనను వహాబ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
"గత రెండేళ్లుగా నేను నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2023లో రిటైర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా జాతీయ జట్టుకు, దేశానికి తగినంత సేవ చేశానన్న భావనలో ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. పాకిస్థాన్ తరఫున ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్ లో మాత్రం ఆడుతూనే ఉంటాను" అని రియాజ్ తన ప్రకటనలో స్పష్టం చేశాడు.