తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: సచిన్‌లాగే కోహ్లిని బలి పశువును చేస్తారా?: రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ల మండిపాటు

Virat Kohli: సచిన్‌లాగే కోహ్లిని బలి పశువును చేస్తారా?: రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ల మండిపాటు

Hari Prasad S HT Telugu

23 August 2023, 7:31 IST

    • Virat Kohli: సచిన్‌లాగే కోహ్లిని బలి పశువును చేస్తారా అంటూ రవిశాస్త్రి ఐడియాపై మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. విరాట్ కోహ్లిని నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయించాలని తాను అనుకున్నట్లు శాస్త్రి చెప్పడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు.
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రవిశాస్త్రి
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రవిశాస్త్రి

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రవిశాస్త్రి

Virat Kohli: ప్రస్తుతం టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య నాలుగో స్థానంలో సరైన బ్యాటర్ లేకపోవడం. నిజానికి 2019 వరల్డ్ కప్ ఓడిపోయింది కూడా ఈ కారణం వల్లే. అయితే ఆ సమయంలో విరాట్ కోహ్లిని నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిందిగా తాను చెప్పినట్లు అప్పటి కోచ్ రవిశాస్త్రి ఈ మధ్య అన్నాడు. కానీ అలా చేస్తే సచిన్ లాగే కోహ్లి కూడా బలిపశువు అవుతాడని పలువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

ఈ సందర్భంగా 2007 వరల్డ్ కప్ ను వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఆ వరల్డ్ కప్ లో సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ, యువరాజ్ లాంటి ప్లేయర్స్ జట్టులో ఉన్నా కూడా తొలి రౌండ్లోనే ఇండియా ఇంటిదారి పట్టింది. అప్పుడు ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన పెద్ద తప్పిదం సచిన్, గంగూలీ ఓపెనింగ్ జోడీని విడగొట్టడం. సచిన్ ను నాలుగోస్థానంలో ఆడించారు. అతడు రెండు మ్యాచ్ లలో 7, 0 పరుగులు చేశాడు. ఆ రెండింట్లోనూ ఓడి ఇండియా ఇంటిదారి పట్టింది.

ఇప్పుడు కోహ్లికి కూడా అదే గతి పడుతుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ 2007 వరల్డ్ కప్ గుర్తు చేస్తూ పొరపాటును కూడా ఆ నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించాడు. "నాలుగో స్థానంలో ఇషాన్, విరాట్ కోహ్లిలాంటి వాళ్లను పరిశీలించడం ఆపేయండి. అతన్ని బలిపశువును చేసి నాలుగో స్థానంలో పంపిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయని అనుకోకండి.

ఇండియన్ క్రికెట్ తో ఓ సమస్య ఉంది. 2007 వరల్డ్ కప్ లో ద్రవిడ్, గ్రెగ్ ఛాపెల్ కలిసి సచిన్ ను నాలుగోస్థానంలో పంపించారు. ఎందుకంటే టాపార్డర్ లో సెహ్వాగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. కానీ అది పెద్ద వివాదమైంది. అందువల్ల కోహ్లిలాంటి ప్లేయర్ దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఇది సులువుగా దొరికే పరిష్కారంగా కనిపించొచ్చు కానీ అది కోహ్లికే నష్టం" అని సంజయ్ మంజ్రేకర్ స్పష్టం చేశాడు.

మరో మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. "మీ బెస్ట్ బ్యాటర్ తాను సక్సెస్ సాధించిన తన రెగ్యులర్ స్థానంలోనే బ్యాటింగ్ చేయాలి. చాలా ఏళ్లుగా నాలుగో స్థానంలో ఏ బ్యాటర్ లేడంటూ కోహ్లిని ఆడించడం సరి కాదు. 2007 వరల్డ్ కప్ లో సచిన్ ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపిస్తే ఏం జరిగిందో గుర్తుంది కదా" అని దొడ్డ గణేష్ ట్వీట్ చేశాడు.

తదుపరి వ్యాసం