Sehwag on Ghoomer: ఈ సినిమా చూసి ఏడ్చేశాను.. మీరూ కచ్చితంగా చూడండి: సెహ్వాగ్-sehwag reviews ghoomer movie with a heart touching message ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sehwag On Ghoomer: ఈ సినిమా చూసి ఏడ్చేశాను.. మీరూ కచ్చితంగా చూడండి: సెహ్వాగ్

Sehwag on Ghoomer: ఈ సినిమా చూసి ఏడ్చేశాను.. మీరూ కచ్చితంగా చూడండి: సెహ్వాగ్

Hari Prasad S HT Telugu
Aug 18, 2023 09:31 AM IST

Sehwag on Ghoomer: ఈ సినిమా చూసి ఏడ్చేశాను.. మీరూ కచ్చితంగా చూడండి అంటూ అభిషేక్ బచ్చన్ నటించిన ఘూమర్ మూవీపై సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఘూమర్ మూవీలో అభిషేక్ బచ్చన్, సయామీ ఖేర్
ఘూమర్ మూవీలో అభిషేక్ బచ్చన్, సయామీ ఖేర్

Sehwag on Ghoomer: బాలీవుడ్ లో క్రికెట్‌పై మరో సినిమా రూపొందింది. ఈ సినిమా పేరు ఘూమర్. అభిషేక్ బచ్చన్ నటించిన ఈ సినిమా ఓ స్పిన్ బౌలర్ చుట్టూ తిరుగుతుంది. కుడి చేయి లేని ఓ అమ్మాయి ఎలా లెఫ్టామ్ స్పిన్నర్ గా ఎదుగుతుందన్నది ఇందులో చూపించారు. సయామీ ఖేర్ ఆ పాత్ర పోషించగా.. ఆమె కోచ్ గా అభిషేక్ కనిపించాడు.

అయితే ఈ ఘూమర్ మూవీని తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చూశాడు. తనను కంటతడి పెట్టించిన ఈ సినిమాను అందరూ చూడాలని అతడు పిలుపునివ్వడం విశేషం. ఓ వీడియో ద్వారా ఘూమర్ మూవీపై వీరూ ప్రశంసలు కురిపించాడు. ఈ వీడియోను అమితాబ్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఎంతో సాధారణ భాషలో ఎంతో పెద్ద విషయం సెహ్వాగ్ చెప్పాడంటూ బిగ్ బీ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో సెహ్వాగ్ ఏమన్నాడంటే.. "నిన్న నేను ఘూమర్ సినిమా చూశాను. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత క్రికెట్ సినిమా చూడటంలో ఆనందం కలిగింది. ఎందుకంటే ఇందులో క్రికెట్ ఎలాగూ ఉంది. దానితోపాటు ఎమోషన్ కూడా ఉంది. ఓ క్రీడాకారుడు పడే కష్టం ఉంది. ముఖ్యంగా గాయం తర్వాత తిరిగి ఆడాలంటే ఎంతగా శ్రమించాలో తెలుస్తుంది" అని సెహ్వాగ్ అన్నాడు.

అంతేకాదు ఈ సినిమా ఏడిపిస్తుందని కూడా స్పష్టం చేశాడు. "నేను స్పిన్నర్ కు ఎప్పుడూ గౌరవం ఇవ్వను. కానీ సయామీ ఖేర్ వేసిన ఘూమర్ మాత్రం అద్భుతం. ఈ రోల్ చాలా కష్టం. కానీ ఆమె ఎమోషనల్ చేసేసింది. ఇక కోచ్ మాట కూడా నేను అస్సలు వినను. కానీ అభిషేక్ బచ్చన్ చేసిన యాక్టింగ్ చూస్తే మీరు అతని మాట కచ్చితంగా వింటారు. ఆగస్ట్ 18కి ఈ సినిమా కచ్చితంగా చూడండి. స్ఫూర్తి పొందండి. బచ్చన్ జీ చెప్పినట్లు నేను కూడా చెబుతాను. ఐ లవ్ దిస్ గేమ్. మీ వెంట కన్నీళ్లను కూడా తీసుకెళ్లండి. ఈ సినిమా మిమ్మల్ని ఏడిపిస్తుంది" అని ఆ వీడియోలో సెహ్వాగ్ అన్నాడు.

ఘూమర్ మూవీ శుక్రవారం (ఆగస్ట్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అభిషేక్ కోచ్ పాత్రలో నటించాడు. ఓ దివ్యాంగురాలైన క్రికెటర్ ను చూసిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందో ఈ సినిమాలో చూపించారు. పా మూవీ ఫేమ్ ఆర్ బాల్కీ ఈ ఘూమర్ ను డైరెక్ట్ చేశాడు. అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు.

Whats_app_banner