తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asia Cup 2023 Opening Ceremony: ఆసియా కప్ 2023 రేపే ప్రారంభం.. ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Asia Cup 2023 Opening Ceremony: ఆసియా కప్ 2023 రేపే ప్రారంభం.. ఓపెనింగ్ సెర్మనీ లైవ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu

29 August 2023, 17:24 IST

google News
    • Asia Cup 2023 Opening Ceremony: ఆసియా కప్ 2023 బుధవారం (ఆగస్ట్ 30) ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీ ఓపెనింగ్ సెర్మనీతోపాటు తొలి మ్యాచ్ లైవ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలో ఓసారి చూద్దాం.
ఆసియా కప్ 2023 ట్రోఫీ
ఆసియా కప్ 2023 ట్రోఫీ (Getty)

ఆసియా కప్ 2023 ట్రోఫీ

Asia Cup 2023 Opening Ceremony: క్రికెట్‌లోని మహాసమరాల్లో ఒకటైన ఆసియా కప్ బుధవారం (ఆగస్ట్ 30) ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీ 16వసారి జరగబోతోంది. ఈసారి పాకిస్థాన్, శ్రీలంక కలిసి ఆసియా కప్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. బుధవారం జరగబోయే తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, నేపాల్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్ లోని ముల్తాన్ స్టేడియంలో జరగనుంది.

గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ లో రన్నరప్ గా నిలిచింది పాకిస్థాన్. ఫైనల్లో శ్రీలంక చేతుల్లో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈసారి వన్డే వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న ఆసియా కప్ కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఫార్మాట్ కు అలవాటు పడి ఆ మెగా టోర్నీ గెలిచేందుకు ఆసియా జట్లకు ఈ టోర్నీ ఉపయోగకరంగా మారనుంది.

ఆసియా కప్ 2023 ఓపెనింగ్ సెర్మనీ ఎప్పుడు?

ఆసియా కప్ 2023 ఓపెనింగ్ సెర్మనీ బుధవారం (ఆగస్ట్ 30) జరగనుంది. తొలి మ్యాచ్ కు ముందు ఈ సెర్మనీ ఉంటుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీ ముల్తాన్ లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫార్మ్ చేసేది వీళ్లే..

ఆసియా కప్ 2023 ఓపెనింగ్ సెర్మనీ ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లా సాగనుంది. ఈ సెర్మనీలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ప్రముఖ సింగర్ ఆతిఫ్ అస్లమ్ పర్ఫార్మ్ చేయనున్నారు. అంతేకాదు సాంప్రదాయ ఏషియన్ మ్యూజిక్, డ్యాన్స్ ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి. చివర్లో బాణసంచా వెలుగులు కూడా ఉంటాయి.

ఆసియా కప్ 2023 ఎక్కడ చూడాలి?

ఇండియాలో ఆసియా కప్ 2023 ఓపెనింగ్ సెర్మనీతోపాటు ఇతర మ్యాచ్ లు స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

ఆసియా కప్ 2023 గ్రూప్స్, జట్లు ఏవి?

ఆసియా కప్ 2023లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఎలో మూడు, గ్రూప్ బిలో మూడు టీమ్స్ ఉన్నాయి. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.

ఆసియా కప్ 2023 గ్రూప్ స్టేజ్ షెడ్యూల్

ఆగస్ట్ 30: పాకిస్థాన్ వెర్సెస్ నేపాల్, మధ్యాహ్నం 3 గంటలకు

ఆగస్ట్ 31: బంగ్లాదేశ్ వెర్సెస్ శ్రీలంక, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 2: ఇండియా వెర్సెస్ పాకిస్థాన్, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 3: బంగ్లాదేశ్ వెర్సెస్ ఆఫ్ఘనిస్థాన్, మధ్యామ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 4: ఇండియా వెర్సెస్ నేపాల్, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 5: శ్రీలంక వెర్సెస్ ఆఫ్ఘనిస్థాన్, మధ్యాహ్నం 3 గంటలకు

తదుపరి వ్యాసం