తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ben Stokes Out Of Ipl 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కి షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్

Ben Stokes out of IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కి షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్

Hari Prasad S HT Telugu

23 November 2023, 19:24 IST

    • Ben Stokes out of IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కి షాక్ తగిలేలా ఉంది. వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ తో బెన్ స్టోక్స్
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ తో బెన్ స్టోక్స్ (BCCI)

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ తో బెన్ స్టోక్స్

Ben Stokes out of IPL 2024: ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కు పెద్ద షాక్ తగిలినట్లే. ఈ ఏడాది మొదట్లో జరిగిన వేలంలో స్టోక్స్ ని ఏకంగా రూ.16.25 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

అయితే మోకాలి గాయం కారణంగా బెన్ స్టోక్స్ పెద్దగా ఆడలేకపోయాడు. ఇక వచ్చే ఏడాది కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చన్న వార్తలు సీఎస్కేను ఆందోళనకు గురి చేసేవే. ఇంగ్లండ్ తరఫున ప్రధాన సిరీస్ లలో కచ్చితంగా ఆడాలని భావిస్తున్న స్టోక్స్.. తనపై పని భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాడు. జనవరిలో ఇండియాతో ఐదు టెస్ట్ ల సిరీస్ కూడా ఉంది.

ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ ముగియగానే జూన్, జులై నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో ఎక్కువ రిస్క్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో స్టోక్స్ ఉన్నాడు. ఈ ఏడాది కూడా స్టోక్స్ కేవలం 2 ఐపీఎల్ మ్యాచ్ లలోనే ఆడాడు. ఇక ఇప్పుడు అతడు తన మోకాలి గాయానికి సర్జరీ కోసం చూస్తున్నాడు. సర్జరీ తర్వాత జనవరిలో ఇండియాతో సిరీస్ ప్రారంభానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని భావిస్తున్నాడు.

ఈ మధ్యే ఇంగ్లండ్ తరఫున వన్డే వరల్డ్ కప్ లోనూ బెన్ స్టోక్స్ ఆడిన విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ 9 మ్యాచ్ లలో కేవలం 3 గెలిచి లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది. నిజానికి గతేడాది వన్డేల నుంచి రిటైరైన స్టోక్స్.. వరల్డ్ కప్ కోసం తన మనసు మార్చుకున్నాడు. అయితే ఈ టోర్నీలో అతనితోపాటు టీమ్ మొత్తం విఫలమైంది.

తదుపరి వ్యాసం