తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohammad Shami: ఆ జట్టుకే దడ ఉంటుంది: భారత పేసర్ మహమ్మద్ షమీ

Mohammad Shami: ఆ జట్టుకే దడ ఉంటుంది: భారత పేసర్ మహమ్మద్ షమీ

15 September 2024, 11:15 IST

google News
    • Mohammad Shami: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యారు. కొందరు ప్లేయర్లు, మాజీలు ఈ సిరీస్‍పై మాట్లాడుతున్నారు. భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి ఈ సిరీస్ గురించి ప్రశ్న ఎదురదవగా స్పందించాడు. 
Mohammad Shami: ఆ జట్టుకే దడ ఉంటుంది: భారత పేసర్ మహమ్మద్ షమీ
Mohammad Shami: ఆ జట్టుకే దడ ఉంటుంది: భారత పేసర్ మహమ్మద్ షమీ (ICC-X)

Mohammad Shami: ఆ జట్టుకే దడ ఉంటుంది: భారత పేసర్ మహమ్మద్ షమీ

టీమిండియా తదుపరి బంగ్లాదేశ్‍తో స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19న ఈ సిరీస్ మొదలుకానుంది. ఆ తర్వాత కూడా మరిన్ని సిరీస్‍ల్లో తలపడనుంది. అయితే, ప్రస్తుతం అందరి దృష్టి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ఉంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది నవంబర్ 22న ఈ ఐదు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. అయితే, ఇప్పటి నుంచే ఈ సిరీస్‍పై చర్చలు జరుగుతున్నాయి.

2018-19లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. 2020-21లోనూ ఆసీస్ గడ్డపై ఆ జట్టును టీమిండియా చిత్తు చేసి టైటిల్ గెలిచింది. గతేడాది స్వదేశంలో జరిగిన సిరీస్‍లోనూ భారత్ విజయం సాధించింది. ఇప్పటి వరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టులే ఉండగా.. ఈ ఏడాది నుంచి ఐదు ఉండనున్నాయి.

ఈసారి కూడా ఈ సిరీస్‍లో గెలిచి.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ గడ్డపై హ్యాట్రిక్, కొట్టాలని రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ పట్టుదలగా ఉంది. గెలిస్తే వరుసగా ఐదోసారి ఈ ట్రోఫీ టీమిండియా కైవసం అవుతుంది. ఈసారైన స్వదేశంలో ట్రోఫీని దక్కించుకోవాలని ఆసీస్ భావిస్తోంది. దీంతో ఈ సిరీస్ మరింత రసవత్తరంగా ఉండనుంది. అయితే, ఇప్పటికే ఈ సిరీస్ హీట్ మొదలైంది. కొందరు మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు ఈ సిరీస్‍పై స్పందిస్తున్నారు. భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తాజాగా ఈ సిరీస్ గురించి స్పందించాడు.

ఆస్ట్రేలియాకే దిగులు

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) వార్షికోత్సవానికి షమీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి ప్రశ్న ఎదురువగా అతడు స్పందించాడు. టీమిండియా ఫేవరెట్ అని, దడ ఏమైనా ఉండే అది ఆస్ట్రేలియాకే అని చెప్పారు. “మేం ఫేవరెట్స్‌గా ఉన్నాం. వాళ్లే దిగులు ఉండాలి” అని షమీ అన్నాడు.

షమీ కమ్‍బ్యాక్ ఎప్పుడో..

గతేడాది వన్డే ప్రపంచకప్ సమయంలో మహమ్మద్ షమీ గాయపడ్డాడు. అప్పటి నుంచి జట్టుకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్నాడు. భారత పేస్ దళాన్ని జస్‍ప్రీత్ బుమ్రా ముందుకు నడిపిస్తున్నాడు. మహమ్మద్ సిరాజ్ రాణిస్తున్నాడు. అయితే, షమీ మళ్లీ ఎప్పుడు భారత జట్టులోకి వస్తాడనేది ఇంకా క్లారిటీ రాలేదు. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో మొదలయ్యే టెస్టు సిరీస్‍కు అందుబాటులోకి వస్తాడని టీమిండియా మేనేజ్‍మెంట్‍తో పాటు అభిమానులు కోలుకుంటున్నారు.

పూర్తిగా కోలుకున్నాకే..

ఆస్ట్రేలియా గడ్డపై షమీ చాలా ప్రభావం చూపించలడు. పేస్‍కు అనుకూలించే ఆ పిచ్‍పై చెలరేగే అవకాశం ఉంటుంది. అయితే, తాను 100 శాతం కోలుకున్నాకే మళ్లీ జట్టులోకి వస్తానని, తొందరపడనని షమీ స్పష్టం చేశాడు.

ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నప్పుడు భారత జట్టులోకి కమ్‍బ్యాక్ ఇస్తానని షమీ చెప్పాడు. “నేను మళ్లీ జట్టులోకి వచ్చేందుకు చాలా కష్టపడుతున్నా. ఎందుకంటే నేను ఆటకు దూరమై చాలా కాలమైంది. అయితే నేను తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. నేను నా ఫిట్‍నెస్‍పై పూర్తిస్థాయిలో కృషి చేయాలి. అందుకే ఎలాంటి ఇబ్బంది వద్దనుకుంటున్నా” అని షమీ అన్నాడు.

తదుపరి వ్యాసం