తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ బర్త్‌డే.. అభిషేక్ బచ్చన్‌పై ఫ్యాన్స్ సీరియస్.. ఇదీ కారణం

Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ బర్త్‌డే.. అభిషేక్ బచ్చన్‌పై ఫ్యాన్స్ సీరియస్.. ఇదీ కారణం

Hari Prasad S HT Telugu

02 November 2023, 20:15 IST

google News
    • Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ బర్త్‌డే సందర్భంగా అభిషేక్ బచ్చన్‌పై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇద్దరి మధ్యా గొడవల వార్తల నేపథ్యంలో ఐశ్వర్య బర్త్ డే ప్రముఖంగా వార్తల్లో నిలిచింది.
తన కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ తో ఐశ్వర్య రాయ్ బర్త్ డే సెలబ్రేషన్స్
తన కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ తో ఐశ్వర్య రాయ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (Sunil Khandare)

తన కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ తో ఐశ్వర్య రాయ్ బర్త్ డే సెలబ్రేషన్స్

Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురువారం (నవంబర్ 2) తన 50వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ మాజీ ప్రపంచ సుందరి తన పుట్టిన రోజున సియోన్‌లోని జీఎస్‌బీ సేవా మండల్ లో క్యాన్సర్ పేషెంట్లతో జరుపుకోవడం విశేషం. ఆమెతోపాటు కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ ఉన్నారు. అయితే ఐశ్వర్య బర్త్ డే సందర్భంగా అభిమానులు ఆమె భర్త అభిషేక్ బచ్చన్ ను టార్గెట్ చేశారు.

ఐశ్వర్యకు అభిషేక్ బర్త్ డే విషెస్ చెప్పిన విధానం వాళ్లకు నచ్చలేదు. అర్ధరాత్రి తన భార్య అందమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిషేక్ విషెస్ చెప్పాడు. అయితే 50వ పుట్టిన రోజును ఐశ్వర్య ఘనంగా జరుపుకుంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇప్పటికే ఆమెకు, బచ్చన్ కుటుంబానికి మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో సింపుల్ గా 50వ బర్త్ డే జరుపుకోవడం మరిన్ని పుకార్లకు తావిస్తోంది.

బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్య మైల్ స్టోన్ బర్త్ డేను ఎందుకు గ్రాండ్ సెలబ్రేట్ చేయలేదంటూ సోషల్ మీడియాలో అభిమానులు నిలదీస్తున్నారు. అభిషేక్ కూడా సింపుల్ గా హ్యాపీ బర్త్ డే అని విష్ చేశాడు. కనీసం హ్యాపీ బర్త్ డే మై డియర్ లేదా డార్లింగ్ అంటే నీ సొమ్మేం పోతోంది అంటూ ఓ అభిమాని ఈ పోస్ట్ పై కామెంట్ చేయడం విశేషం.

మీ నాన్న బర్త్ డే నాడు ఓ ఆర్టికల్ అంత విషెస్ చెప్పావు.. నీ భార్యకు మాత్రం సింపుల్ గా హ్యాపీ బర్త్ డేనేనా అంటూ మరో అభిమాని ప్రశ్నించాడు. ఐశ్వర్య 50వ పుట్టిన రోజు మరీ ఇంత డ్రైగా జరగడం బాలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అభిమానులంతా ట్విటర్ లో ఐశ్వర్య ట్రెండింగ్ లో ఉండేలా చూస్తే.. తన భర్త మాత్రం పట్టించుకోకపోవడంపై వాళ్లకు నచ్చలేదు.

ఐశ్వర్య తన 50వ పుట్టిన రోజును కూతురు, తల్లితో సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ముంబైలోని సిద్ది వినాయకుని ఆలయానికి వెళ్లింది. కొన్ని నెలలుగా ఐశ్వర్య, అభిషేక్ మధ్య గొడవలు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య బర్త్ డే సింపుల్ గా జరగడం ఆ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్లు అయింది.

తదుపరి వ్యాసం