తెలుగు న్యూస్  /  career  /  Nlc Recruitment : ఎన్ఎల్‌సీలో ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం ఇక్కడ తెలుసుకోండి

NLC Recruitment : ఎన్ఎల్‌సీలో ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం ఇక్కడ తెలుసుకోండి

Anand Sai HT Telugu

16 December 2024, 17:07 IST

google News
    • NLC Recruitment 2024 : నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) పలు పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉద్యోగాలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉద్యోగాలు

ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఎన్ఎల్‌సీ పలు పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం చివరి తేదీ కంటే ముందే దరఖాస్తు చేసుకోవాలి.

భారతదేశంలోని నవరత్న కంపెనీలలో ఒకటైన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (GET) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద, వివిధ సాంకేతిక రంగాల్లోని మొత్తం 167 పోస్టులపై నియామకాలు జరుగుతాయి.

పోస్టుల వివరాలు చూస్తే.. మెకానికల్: 84 పోస్టులు, ఎలక్ట్రికల్: 48 పోస్టులు, సివిల్: 25 పోస్టులు, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్: 10 పోస్ట్‌లు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. OBC వర్గానికి 3 సంవత్సరాలు, ఎస్టీ/ఎస్టీ వర్గానికి 5 సంవత్సరాల వయో సడలింపు ఉంది. వయస్సు డిసెంబర్ 1, 2024 నాటికి లెక్కిస్తారు.

దరఖాస్తు రుసుము విషయానికొస్తే.. అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ వారికి రూ. 854, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి రూ. 354గా నిర్ణయించారు. 16 డిసెంబర్ 2024న దరఖాస్తు ప్రారంభమైంది. చివరి తేదీ 15 జనవరి 2025గా ఉంది.

ఎలా దరఖాస్తు చేయాలి

దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు NLC అధికారిక వెబ్‌సైట్ www.nlcindia.inని సందర్శించాలి.

ఇక్కడ కెరీర్ విభాగానికి వెళ్లి రిక్రూట్‌మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లింక్‌ మీద క్లిక్ చేయండి.

తరువాత, అభ్యర్థులు మొదట నమోదు చేసుకోవాలి, వివరాలను పూరించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత ఫారమ్‌ను సమర్పించి, దాని ప్రింటౌట్‌ను తీసుకోవాలి. భవిష్యత్తులు ఉపయోగపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం