Zomato Q3 results : జొమాటో షేర్లతో భారీ లాభాలు.. స్టాక్ ప్రైజ్ టార్గెట్ ఇదే!
10 February 2023, 10:33 IST
- Zomato share price target : జొమాటో క్యూ3 ఫలితాల అనంతరం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు స్టాక్ ప్రైజ్ టార్గెట్‌ను వెల్లడించాయి. ఆ వివరాలు..
జొమాటో షేర్లతో భారీ లాభాలు.. స్టాక్ ప్రైజ్ టార్గెట్ ఇదే!
Zomato Q3 results : ఖర్చులు భారీగా పెరగడం, ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో వృద్ధి నెమ్మదించడం కారణంగా.. 2023 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో జొమాటో సంస్థ నెట్ లాస్ మరింత పెరిగింది. అయితే.. అంచనాలకు మించిన ఆదాయం నమోదవడం సానుకూల విషయం. ఇక జనవరిలో తమ ఫుడ్ డెలివరీ బిజినెస్ వృద్ధి మళ్లీ పట్టాలెక్కిందని జొమాటో చెప్పింది. ఆర్డర్ల సంఖ్య భారీగా పెరిగినట్టు వివరించింది. ఈ నేపథ్యంలో జొమాటో షేర్లను ఇప్పుడు కొనొచ్చా? అని మదుపర్లలో సందేహాలు నెలకొన్నాయి. వీటిపై స్టాక్ మార్కెట్ నిపుణులు స్పందించారు. ఆ వివరాలను తెలుసుకుందాము..
జొమాటో క్యూ3 ఫలితాలు..
క్యూ3లో జొమాటో యావరేజ్ ఆర్డర్ వాల్యూ 6శాతం పెరిగింది. మొత్తం మీద ఆర్డర్ వాల్యూమ్ 14శాతం వృద్ధి చెందింది. అడ్జెస్టెడ్ ఎబిట్డా.. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా పాజిటివ్‌గా నిలిచింది.
Zomato share price target : "నష్టాలను తగ్గించుకునేందుకు జొమాటో తీవ్రంగా కృషిచేస్తోందని స్పష్టమవుతోంది. అడ్జెస్టెడ్ ఎబిట్డా (బ్లింకిట్‌ను మినహాయిస్తే) రూ. 0.4 బిలియన్ కన్నా తక్కువే ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంటామని సంస్థ చెబుతుండటంతో స్టాక్ ఔట్లుక్ పాజిటివ్‌గానే ఉంది. జొమాటో గోల్డ్ కూడా ఉపయోగపడుతోంది. నష్టాలను తగ్గించుకుంటూ.. బ్లింకిట్ సైతం పుంజుకుంటోంది," అని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ వెల్లడించింది.
LIC Q3 results : ఎల్ఐసీ క్యూ3 ఫలితాల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నేపథ్యంలో.. జొమాటో క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉన్నట్టు చెప్పిన జెఫ్రీస్.. షేర్ ప్రైజ్ టార్గెట్‌ను రూ. 100గా పేర్కొంది. భవిష్యత్తులో జొమాటో వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇది సంస్థకు మంచి విషయం అని స్పష్టం చేసింది.
ఇక మరో అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ.. జొమాటోకు ఓవర్‌వెయిట్ రేటింగ్ ఇచ్చింది. జొమాటో షేర్ ప్రైజ్ టార్గెట్‌ను రూ. 82గా పేర్కొంది.
జొమాటో స్టాక్ ధర..
Zomato share price : శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ఉదయం 10 గంటల సమయంలో జొమాటో షేర్లు 1శాతం నష్టంతో రూ. 54 వద్ద ఉన్నాయి. ఇక ఐదు రోజుల్లో ఈ స్టాక్ 10.3శాతం పెరిగింది. నెల రోజుల వ్యవధిలో మాత్రం 1.6శాతం పతనమైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 10.8శాతం నష్టపోయింది జొమాటో స్టాక్. ఆరు నెలల వ్యవధిలో 4శాతం, ఏడాది కాలంలో 43.2శాతం మేర నష్టపోయింది ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో స్టాక్.