తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zerodha Ceo : 'ట్రేడింగ్​లో సక్సెస్​ అవ్వాలంటే..' జెరోధా నితిన్​ కామత్​ టిప్స్​..

Zerodha CEO : 'ట్రేడింగ్​లో సక్సెస్​ అవ్వాలంటే..' జెరోధా నితిన్​ కామత్​ టిప్స్​..

Sharath Chitturi HT Telugu

26 April 2024, 9:36 IST

google News
  • Stock market trading tips : స్టాక్​ మార్కెట్​ ట్రేడర్లకు కీలక టిప్స్​ ఇచ్చారు జెరోధా సీఈఓ నితిన్​ కామత్​. ట్రేడింగ్​లో సక్సెస్​ అవ్వాలంటే.. ఏం చేయాలో చెప్పారు. 

జెరోధా సీఈఓ నితిన్​ కామత్​..
జెరోధా సీఈఓ నితిన్​ కామత్​.. (X/Nithin Kamath)

జెరోధా సీఈఓ నితిన్​ కామత్​..

Zerodha CEO traing tips : కొవిడ్​ తర్వాత స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​కి విపరీతంగా డిమాండ్​ పెరిగింది. చాలా మంది ట్రేడర్లగా సెటిల్​ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఫెయిల్​ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రేడింగ్​లో సక్సెస్​ అవ్వాలంటే ఏం చేయాలి? అన్న ప్రశ్నకు ట్రిక్​ చెప్పారు జెరోధా సీఈఓ, కో-ఫౌండర్​ నితిన్​ కామత్​. ‘ట్రేడింగ్​లో సక్సెస్​ సాధించాలంటే టఫ్​ డేస్​ని సర్​వైవ్​ అవ్వాలి’ అని సూచించారు. అంతేకాదు.. ట్రేడింగ్​లో తక్కువ రిస్క్​ ఉండే బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, ఐరన్ కాండోర్స్ వంటి వ్యూహాలను వివరించారు.

“అస్థిరత కారణంగా మీరు డబ్బు కోల్పోకుండా ఉండటానికి ఒక మార్గం స్ప్రెడ్స్ వంటి పూర్తిగా హెడ్జ్డ్ ఆప్షన్స్ వ్యూహాలతో ట్రేడింగ్ చేయడం. వాస్తవానికి, ఇది మాత్రమే సహాయపడదు. రిస్క్​ని, సైజ్​ని కంట్రోల్​ చేయగలిగే స్ట్రాటజీలు మీ దగ్గర ఉండాలి,” అని ట్వీట్​ చేశారు నితిన్​ కామత్​.

ఇదీ చూడండి:- Stock market psychology : ఇది తెలిస్తే.. స్టాక్​ మార్కెట్​లో కోట్ల సంపద మీ సొంతం!

'స్పేక్స్​తో ట్రేడర్లు ట్రాప్​ అవుతున్నారు..'

Nithi Kamat trading tips : స్ప్రెడ్స్ వంటి పూర్తి హెడ్జ్డ్ ఆప్షన్స్ వ్యూహాలను ఎలా ఉపయోగించాలో సెన్సిబుల్ చేసిన పోస్ట్​ను షేర్ చేస్తూ.. " స్టాక్​ మార్కెట్ ఏమి చేసినా, బుల్ కాల్ స్ప్రెడ్ లేదా బేర్​ పుట్ స్ప్రెడ్ వంటి స్ప్రెడ్​ను మీరు ట్రేడ్ చేస్తే నష్టం పరిమితమవుతుంది. మీ నష్టాలు నిర్ణీత సంఖ్యను మించవు," అని నితిన్​ కామత్​ అన్నారు.

“సులభంగా డబ్బు సంపాదించేందుకు అతి కష్టమైన మార్గం ఏదైనా ఉందంటే.. అది ట్రేడింగ్​ మాత్రమే! ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. ఒక సక్సెస్​ఫుల్​ ట్రేడర్​ అవ్వాడానికి ట్రిక్.. మార్కెట్​లో బ్యాడ్​ డేస్​ని తట్టుకుని నిలబడటం," అని నితిన్​ కామత్​ పేర్కొన్నారు.

Stock market trading tips in Telugu : "గత సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా, ఎక్స్​పైరీ రోజుల్లో ఆప్షన్ ధరల్లో సడెన్​ స్పైక్​ కనిపిస్తోంది. ట్రేడర్లు ట్రాప్​ అయిపోతున్నారు," అని ఆయన అన్నారు.

తదుపరి వ్యాసం