తెలుగు న్యూస్  /  ఫోటో  /  Intraday Trading Tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువే! ఎందుకు?

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువే! ఎందుకు?

02 February 2024, 13:50 IST

Intraday trading tips in Telugu : స్టాక్​ మార్కెట్​లో ఇంట్రాడే ట్రేడింగ్​ చేద్దామని భావిస్తున్నారా? అది అంత సులభమైన విషయం కాదు. ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువే ఉంది! ఎందుకు? ఆ 5శాతం మందిలో ఉండి సక్సెస్​ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..

  • Intraday trading tips in Telugu : స్టాక్​ మార్కెట్​లో ఇంట్రాడే ట్రేడింగ్​ చేద్దామని భావిస్తున్నారా? అది అంత సులభమైన విషయం కాదు. ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువే ఉంది! ఎందుకు? ఆ 5శాతం మందిలో ఉండి సక్సెస్​ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి..
స్టాక్​ మార్కెట్​ అంటేనే రిస్క్​తో కూడిన వ్యవహారం. ఇక ఇంట్రాడే ట్రేడింగ్​లో రిస్క్​ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక.. చాలా మంది ఈజీ మనీ కోసం ట్రేడింగ్​ చేస్తూ ఉంటారు. మార్కెట్​ అనేది.. మొదట్లో డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి.. ఆ తర్వాత భారీగా దెబ్బ తీస్తుంది. ఇది దాదాపు అందరికి జరిగేదే!
(1 / 6)

అందుకే.. ఇంట్రాడే ట్రేడింగ్​లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్రాడే ట్రేడింగ్​లో స్ట్రాటజీ, రిస్క్​ మేనేజ్​మెంట్​కి మించిన విషయం ఒకటి ఉంది. దానిని అలవాటు చేసుకోలేకే చాలా మంది ఫెయిల్​ అవుతూ ఉంటారు. అదే సైకాలజీ!
(2 / 6)

ఇంట్రాడే ట్రేడింగ్​కి స్ట్రాటజీ అవసరం. కానీ స్ట్రాటజీ తెలిసిన ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించేస్తుంటే.. సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువ ఎందుకు ఉంటుంది? సైకాలజీ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఒకే విధంగా పరిగణించాల్సి ఉంటుంది. దేనిని హార్ట్​కి తీసుకోకూడదు. ఈ రోజు నష్టం వస్తే.. దానిని ఈరోజే వదిలేయాలి. దాని గురించే ఆలోచిస్తూ.. ఉండిపోతే, రేపు తీసుకునే ట్రేడ్​పై ఎఫెక్ట్​ పడుతుంది. అది ట్రేడింగ్​లో కెరీర్​కి మంచిది కాదు.
(3 / 6)

నష్టాలు వస్తే.. చాలా మంది రివేంజ్​ ట్రేడ్​ చేస్తూ ఉంటారు. అది అస్సలు కరెక్ట్​ కాదు. రివేంజ్​ ట్రేడ్​ చేస్తే.. మార్కెట్​కి నష్టం లేదు! మనకే నష్టం! మన క్యాపిటల్​ ఊడ్చుకుపోతుంది. నష్టం వచ్చినా, లాభాలొచ్చిన ప్రశాంతంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
(4 / 6)

ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ అనేది మన లైఫ్​స్టైల్​పైనా ఆధారపడి ఉంటుంది. ట్రేడ్​ తీసుకునేటప్పుడు మన బ్రెయిన్​ క్లియర్​గా, యాక్టివ్​గా ఉండాలి. రాత్రి సరైన నిద్రలేకపోతే బ్రెయిన్​ సరిగ్గా పని చేయదు. ఉదయం సరిగ్గా పని చేయలేరు. అందుకే.. ఒక మంచి లైఫ్​స్టైల్​ని అలవాటు చేసుకోవాలి,
(5 / 6)

అదే సమయంలో.. సైకాలజీతో పాటు స్ట్రాటజీలను పక్కా రిస్క్​ మేనేజ్​మెంట్​తో పేపర్​ ట్రేడ్​ చేయాలి. కనీసం 3 నెలల పాటు స్ట్రాటజీని టెస్ట్​ చేయాలి. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగానే ట్రేడ్​ ప్లాన్​ చేయాలి. ఈ టిప్స్​ పాటిస్తే.. ఇంట్రాడే ట్రేడింగ్​లో మీరు కచ్చితంగా సక్సెస్​ అవుతారు!
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి