Electric scooter : నగరాల్లో వాడేందుకు ఇదే ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్! అఫార్డిబుల్ ధరతో..
16 November 2024, 11:15 IST
- సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నగరాల్లో ప్రయాణాల కోసం రూపొందించిన ఈ జెలియో ఎక్స్ మెన్ 2.0 ఈ స్కూటర్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌తో నగరాల్లో ఈజీగా తిరిగేయొచ్చు!
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని 2 వీలర్ ఈవీ సెగ్మెంట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అడుగుపెట్టింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జెలియో.. ఎక్స్ మెన్ 2.0 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని విడుదల చేసింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.71,500 నుంచి ప్రారంభమవుతోంది. ఇది గ్రీన్, వైట్, సిల్వర్, రెడ్ కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది. సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే మిస్టరీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఇక ఇప్పుడు తాజాగా లాంచ్ అయిన స్కూటర్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
జెలియో ఎక్స్ మెన్ 2.0 స్లో-స్పీడ్ స్కూటర్! ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తుంది. అవి.. లీడ్ యాసిడ్, లిథియం-అయాన్ బ్యాటరీ. ఈ రెండు కూడా 2 బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తాయి. లీడ్ యాసిడ్ బ్యాటరీ 60వీ 32ఏహెచ్ బ్యాటరీ ధర రూ.71,500 కాగా, 72వీ 32ఏహెచ్ బ్యాటరీ ధర రూ.74 వేలు. లిథియం అయాన్ బ్యాటరీ 60వీ 30ఏహెచ్ ధర రూ.87,500 కాగా, 74వీ 32ఏహెచ్ ధర రూ.91,500. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు! ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. మోటారు 60/72వీ యూనిట్, ఇది ఛార్జ్‌కి 1.5 యూనిట్ల విద్యుత్‌ని ఉపయోగిస్తుందని జెలియో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 180 కిలోల లోడింగ్ సామర్థ్యం, 90 కిలోల బరువును కలిగి ఉంది.
జెలియో ఎక్స్ మెన్ 2.0కి ముందు- వెనుక డిస్క్ బ్రేకులు, ముందు భాగంలో అల్లాయ్ వీల్, వెనుక భాగంలో హబ్ మోటార్ ఉన్నాయి. సస్పెన్షన్ విధులను ముందు భాగంలో టెలిస్కోపిక్ యూనిట్లు, వెనుక భాగంలో షాక్ అబ్జార్బర్లు నిర్వహిస్తాయి.
జెలియో అందిస్తున్న యాంటీ థెఫ్ట్ అలారం, సెంట్రల్ లాకింగ్, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యూఎస్బీ ఛార్జర్, డిజిటల్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. లెడ్ యాసిడ్, లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్లకు జెలియో 10,000 కిలోమీటర్ల వారంటీని సైతం అందిస్తోంది.
జెలియో ఎబిక్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కునాల్ ఆర్య మాట్లాడుతూ, “సమర్థవంతమైన, పర్యావరణ అనుకూల పట్టణ రవాణా ప్రయోజనాలను ఎక్కువ మంది వినియోగదారులు గుర్తించడంతో స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ వేగంగా ఆదరణ పొందుతోంది. ఎక్స్-మెన్ 2.0తో పనితీరు, స్థోమతక, సాంకేతికతను సమతుల్యం చేసే ఉత్పత్తిని ఇంజనీరింగ్ చేయడంపై మేము దృష్టి పెట్టాము. మా అధునాతన తయారీ ప్రక్రియలుస, లోతైన పరిశోధన నేటి పట్టణ ప్రయాణికుల అవసరాలను తీర్చే స్కూటర్ని రూపొందించడానికి మాకు వీలు కల్పించింది. స్టైల్, విశ్వసనీయత, ఆకట్టుకునే రేంజ్‌ని ఈ స్కూటర్ అందిస్తుంది. ఎక్స్ మెన్ 2.0 స్లో-స్పీడ్ విభాగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని మేము నమ్ముతున్నాము. ఇది భారతదేశ ఎలక్ట్రిక్ వాహన పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగంగా మారుతోంది,” అని అభిప్రాయపడ్డారు.