Electric bike : ధర తక్కువ- రేంజ్ ఎక్కువ.. స్టైలిష్ ఓలా ఎలక్ట్రిక్ బైక్‌పై కీలక అప్డేట్!
Ola Electric bike : ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ రోడ్స్టర్ని ఆగస్టు 15న రూ .75,000 కు విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఈ బైక్‌కి సంబంధించిన కీలక అప్డేట్ని పంచుకుంది. ఆ వివరాలు..
ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ రోడ్స్టర్పై కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మోడల్ని లాంచ్ చేసిన దాదాపు మూడు నెలల తరువాత, భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు తన వినియోగదారుల కోసం మొదటి యూనిట్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది! ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఈ ఏడాది ఆగస్ట్‌లో లాంచ్ అవ్వగా, ప్రొడక్షన్‌ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఓలా సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ధ్రువీకరించారు.
ఓలా ఎలక్ట్రిక్ ఎంట్రీ లెవల్ రోడ్‌స్టర్‌తో పాటు మరో మూడు ఎలక్ట్రిక్ బైక్లను ఇప్పటికే ప్రదర్శించింది. త్వరలోనే ఈ సెగ్మెంట్‌ను అనేక ఆఫర్లతో కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల ఉత్పత్తికి ఓలా ఎలక్ట్రిక్ దగ్గరగా ఉందని భవిష్ అగర్వాల్ సోషల్ మీడియాలో సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఈవీ తయారీదారు కొత్త గిగాఫ్యాక్టరీ గురించి అప్డేట్ని పంచుకున్నారు. "ఫ్యూచర్ ఫ్యాక్టరీ త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్‌తో దూసుకెళుతుంది. గిగాఫ్యాక్టరీ వాణిజ్య ఉత్పత్తికి దగ్గరవుతోంది.
ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోడ్స్టర్ని రూ.75,000 ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. అదే సమయంలో రోడ్‌స్టర్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ ప్రారంభమవుతుందని ఓలా తెలిపింది. ఇతర ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల లాంచ్ టైమ్‌లైన్‌పై ఇంకా స్పష్టత రాలేదు.
ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్: హైలైట్స్..
ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో. వీటి ధరలు వరుసగా రూ.74,999, రూ.1,04,999, రూ.1,99,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఈ బైక్లను అందించనున్నారు. వీటి రేంజ్ 150 కి.మీల కన్నా ఎక్కువగా ఉండనుంది. 4.5 కిలోవాట్ల బ్యాటరీతో 200 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఓలా రోడ్‌స్టర్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 2.8 సెకన్లలో అందుకుంటుంది. రోడ్‌స్టర్ ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 124 కిలోమీటర్లు.
ఫీచర్ల పరంగా, ఓలా రోడ్‌స్టర్.. స్పోర్ట్స్, నార్మల్, ఈకో వంటి మూడు రైడింగ్ మోడ్స్‌తో వస్తుంది. ఇందులో 4.3 ఇంచ్ ఎల్సీడీ సెగ్మెంట్ డిస్ప్లే, ఓలా మ్యాప్స్ నావిగేషన్ (టర్న్ బై టర్న్), అడ్వాన్స్డ్ రెజెన్, క్రూయిజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, డీఐవై మోడ్, టీపీఎంఎస్ అలర్ట్స్, ఓటీఏ అప్డేట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ డిజిటల్ కీ అన్‌లాక్, ఓలా ఎలక్ట్రిక్ యాప్ కనెక్టివిటీతో కూడా వస్తుంది.
మరి మీరు ఈ ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ని బుక్ చేసుకున్నారా?
సంబంధిత కథనం