Safest electric cars : రేంజ్​తో పాటు సేఫ్టీలో కూడా ఈ ఎలక్ట్రిక్​ కార్లు బెస్ట్​- మిడల్​ క్లాస్​కి పర్ఫెక్ట్​!-best electric cars xuv 400 vs punch ev nexon ev bharat ncap safety ratings compared ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Safest Electric Cars : రేంజ్​తో పాటు సేఫ్టీలో కూడా ఈ ఎలక్ట్రిక్​ కార్లు బెస్ట్​- మిడల్​ క్లాస్​కి పర్ఫెక్ట్​!

Safest electric cars : రేంజ్​తో పాటు సేఫ్టీలో కూడా ఈ ఎలక్ట్రిక్​ కార్లు బెస్ట్​- మిడల్​ క్లాస్​కి పర్ఫెక్ట్​!

Sharath Chitturi HT Telugu
Nov 16, 2024 06:40 AM IST

కొత్తగా ఒక ఎలక్ట్రిక్​ కారు కొనాలని చూస్తున్నారా? అయితే రేంజ్​తో పాటు సేఫ్టీని కూడా చూడాల్సి ఉంటుంది! ఈ విషయంలో మహీంద్రా ఎక్స్​యూవీ400, టాటా పంచ్​ ఈవీ, టాటా నెక్సాన్​ ఈవీలు బెస్ట్​!

రేంజ్​తో పాటు సేఫ్టీలో కూడా ఈ ఎలక్ట్రిక్​ కార్లు బెస్ట్​
రేంజ్​తో పాటు సేఫ్టీలో కూడా ఈ ఎలక్ట్రిక్​ కార్లు బెస్ట్​

భారత్ న్యూ కార్ అసెస్​మెంట్ ప్రోగ్రామ్ (బీఎన్​సీఏపీ) నిర్వహించిన క్రాష్ టెస్ట్​ల్లో మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్​ని పొందింది. భారత్ ఎన్​సీఏపీలో మహీంద్రా ఎలక్ట్రిక్ కారు క్రాష్ టెస్ట్ చేయించుకోవడం ఇదే తొలిసారి! థార్ రాక్స్, ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వంటి ఇతర మహీంద్రా ఎస్​యూవీలతో పాటు ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ హై సేఫ్టీ రేటింగ్స్​తో క్రాష్ టెస్ట్​లో అదరగొట్టింది. ఈ ఫలితాలు ఎక్స్​యూవీ400 ఈవీని భారతదేశంలోని కొన్ని సురక్షితమైన, ఆల్-ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్​యూవీల్లో ఒకటిగా నిలిపాయి.

భారత్ ఎన్​సీఏపీలో ఇప్పటివరకు మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లను క్రాష్​ టెస్ట్​ చేయడం జరిగింది. వీటిలో టాటా నెక్సాన్ ఈవీ, పంచ్​ ఈవీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు ఎలక్ట్రిక్​ కార్ల సేఫ్టీ రేటింగ్స్​ని ఓసారి చూద్దాము..

మహీంద్రా ఎక్స్​యూవీ 400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ- టాటా పంచ్ ఈవీ: అడల్ట్ ఆక్యుపెంట్​ సేఫ్టీ..

మహీంద్రా ఎక్స్​యూవీ400, టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ అన్నీ అడల్ట్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీ కేటగిరీల్లో ఫైవ్ స్టార్ స్కోర్ సాధించాయి! మరింత ప్రత్యేకంగా, ఎక్స్​యూవీ400 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. అడల్ట్ ఆక్యుపెంట్​ సేఫ్టీలో 32 పాయింట్లకు 30.38, టాటా నెక్సాన్ ఈవీ 32 పాయింట్లకు 29.86, టాటా పంచ్ ఈవీ 32 పాయింట్లకు 31.46 పాయింట్లను సాధించాయి. మూడు కార్లు ఛాతీ, దిగువ కాలు ప్రాంతాలు మినహా మంచి రక్షణను చూపించాయి! అక్కడ రక్షణ స్థాయిలు తగినంతగా లేవనే చెప్పుకోవాలి.

'ఫ్రంటల్ ఆఫ్​సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్', 'సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్'లతో సహా రెండు క్రాష్ల ఫలితాల్లో కేటగిరీ స్కోర్లు 16గా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 400 వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ వర్సెస్ టాటా పంచ్ ఈవీ: చైల్డ్ ఆక్యుపెంట్​ సేఫ్టీ

చైల్డ్​ ఆక్యుపెంట్​ సేఫ్టీ పరంగా ఎక్స్​యూవీ400 ఈవీకి 49కి 43 పాయింట్లు, నెక్సాన్ ఈవీ 49కి 44.95 పాయింట్లు, పంచ్ ఈవీ 49కి 45.00 పాయింట్లు సాధించాయి.

ఈ పరీక్ష కోసం 18 నెలల చిన్నారి డమ్మీని, మూడేళ్ల చిన్నారికి చెందిన మరో డమ్మీని వెనుక సీట్లలో ఉంచుతారు. వాహనంలో కూర్చున్న పిల్లలను అనుకరించేలా చైల్డ్ కంట్రోల్ సిస్టమ్స్​తో డమ్మీలను కారులో అమర్చారు.

ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​ ఈవీ సెగ్మెంట్​లో ప్రస్తుతం ఈ మూడు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు బెస్ట్​ సెల్లింగ్​గా కొనసాగుతున్నాయి. వీటికి సేఫ్టీ కూడా బలంగా ఉండటం కస్టమర్స్​కి సానుకూల విషయం. ఇక మహీంద్రా ఎక్స్​యూవీ400 రేంజ్​ 370-470కి.మీ మధ్యలో ఉంటుంది. టాటా పంచ్​ ఈవీకి అది 315-421కి.మీగా ఉంది. ఇక టాటా నెక్సాన్​ ఈవీ రేంజ్​325-465కి.మీగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం