తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi 14 Ultra : షావోమీ 14 అల్ట్రా.. లాంచ్​కి ముందే ఫీచర్స్​ లీక్​!

Xiaomi 14 Ultra : షావోమీ 14 అల్ట్రా.. లాంచ్​కి ముందే ఫీచర్స్​ లీక్​!

Sharath Chitturi HT Telugu

02 December 2023, 13:53 IST

  • Xiaomi 14 Ultra : షావోమీ 14 అల్ట్రా ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

షావోమీ 14 అల్ట్రా.. లాంచ్​కి ముందే ఫీచర్స్​ లీక్​!
షావోమీ 14 అల్ట్రా.. లాంచ్​కి ముందే ఫీచర్స్​ లీక్​! (Hindustan Times)

షావోమీ 14 అల్ట్రా.. లాంచ్​కి ముందే ఫీచర్స్​ లీక్​!

Xiaomi 14 Ultra : షావోమీ నుంచి కొత్త మొబైల్​ రాబోతోంది. దీని పేరు షావోమీ 14 అల్ట్రా. షావోమీ ప్యాడ్​ 7 ప్రో ట్యాబ్లెట్​తో పాటు ఈ స్మార్ట్​ఫోన్​ కూడా త్వరలోనే లాంచ్​ అవుతుందని టాక్​ నడుస్తోంది. కాగా.. లాంచ్​కి ముందే, ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

షావోమీ 14 అల్ట్రా స్పెసిఫికేషన్స్​ ఇవే..

స్మార్ట్​ఫోన్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.7 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ప్రాసెసర్, ఆడ్రెనో 750 జీపీయూ..​ దీని సొంతం. టాప్​ నాచ్​ పర్ఫార్మెన్స్​ ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Xiaomi 14 Ultra price : ఇక ఈ షావోమీ 14 అల్ట్రాలో 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ వేరియంట్స్​ ఉంటాయని తెలుస్తోంది. వీటిల్లో 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా-వైడ్​తో పాటు 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తుందని సమాచారం.

ఈ మొబైల్​లో 5,180ఎంఏహెచ్​ బ్యాటరీ సెటప్​ ఉండనుంది. 120వాట్​ వయర్డ్​ ఛార్జింగ్​, 50వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ వంటివి ఉంటాయని టాక్​ నడుస్తోంది.

ఇండియాలో లాంచ్​ అవుతుందా?

అయితే.. ఈ షావోమీ 14 అల్ట్రా గ్యాడ్జెట్​ చైనాలో లాంచ్​ అవుతుంది కానీ ఇండియాలోకి రాకపోవచ్చు! గతంలో వచ్చిన స్మార్ట్​ఫోన్​ సిరీస్​లను పరిశీలిస్తే, ఇదే అర్థమవుతుంది. అలా కాకుండా ఈసారి కొత్తగా ప్లాన్​ చేసి, ఇండియాలో కూడా ఈ గ్యాడ్జెట్​ని సంస్థ లాంచ్​ చేస్తుందో లేదో చూడాలి.

Xiaomi 14 Ultra features : ప్రస్తుతానికి ఇవి లీక్స్​ మాత్రమే. పూర్తి వివరాలు లాంచ్​ సమయంలో బయటకు వస్తాయి.

తదుపరి వ్యాసం