తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi 14 India Launch : ఇండియాలో.. షావోమీ 14 సిరీస్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

Xiaomi 14 India launch : ఇండియాలో.. షావోమీ 14 సిరీస్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

Sharath Chitturi HT Telugu

19 February 2024, 16:30 IST

    • Xiaomi 14 India launch : ఇండియాలో.. షావోమీ 14 సిరీస్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇండియాలో.. షావోమీ 14 సిరీస్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..
ఇండియాలో.. షావోమీ 14 సిరీస్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

ఇండియాలో.. షావోమీ 14 సిరీస్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..

Xiaomi 14 pro price in India : షావోమీ 14 ఇండియా లాంచ్​ డేట్​.. ఎట్టకేలకు ఫిక్స్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ని.. మార్చ్​ 7న ఇండియాలో లాంచ్​ చేయనున్నట్టు దిగ్గజ టెక్​ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ షావోమీ 14 సిరీస్​లోని ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Mahindra XUV 3XO bookings: రేపటి నుంచే మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభం; ఇలా బుక్ చేసుకోండి..

Vivo X100 Ultra: ఇది ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసమే.. 200 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్ ఫోన్

High dividend stocks: అదిరిపోయే డివిడెండ్ తో పాటు షేర్ వ్యాల్యూ కూడా బాగా పెరుగుతున్న 5 స్టాక్స్ ఇవి..

Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

షావోమీ 14 ఇండియా లాంచ్​..

షావోమీ 14 సిరీస్​.. చైనాలో గతేడాది అక్టోబర్​లో లాంచ్​ అయ్యింది. ఇక అంతర్జాతీయ మార్కెట్​లో ఈ నెల 25న లాంచ్​కానుంది. ఇక ఇండియాలో మార్చ్​ 7న లాంచ్​ అవ్వనుంది.

షావోమీ 14 సిరీస్​లో మొత్తం మూడు స్మార్ట్​ఫోన్స్​ ఉంటాయి. అవి.. షావోమీ 14, షావోమీ 14 ప్రో, షావోమీ 14 ప్రో అల్ట్రా. ఇండియాలో లాంచ్​ అవుతున్న గ్యాడ్జెట్స్​కి సంబంధించిన ఫీచర్స్​ని సంస్థ ఇంకా ప్రకటించలేదు. కానీ.. చైనాలో ఉన్న ఫీచర్స్​ని చూస్తే.. మనకి ఓ క్లారిటీ వస్తుంది.

Xiaomi 14 ultra price in India : ఈ షావోమీ కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​లో.. 6.36 ఇంచ్​ 1.5కే ఎల్​టీపీఓ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 3000 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ వంటివి ఉంటాయి.

ఈ స్మార్ట్​ఫోన్స్​లో ట్రిపుర్​ రేర్​ కెమెర సెటప్​ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా వైడ్​ లెన్స్​ ఉంటాయి. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తుంది. షావోమీ 14 ప్రీమియం స్మార్ట్​ఫోన్​లో 4,610 ఎంఏహెచ్​ బ్యాటరీ, 90 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​, 50 వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తాయి.

చైనాలో ఈ గ్యాడ్జెట్స్​.. నాలుగు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి.. జేడ్​ గ్రీన్​, బ్లాక్​, వైట్​, స్నో మౌంటైన్​ పింక్​.

షావోమీ 14 స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఎంత ఉండొచ్చు?

Xiaomi 14 launch date in India : చైనాలో షావోమీ 14 సిరీస్​కి నాలుగు వేరియంట్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి. వీటిల్లో.. ఇండియాలోకి ఎన్ని వేరియంట్లు వస్తాయనేది వేచి చూడాలి. కాగా.. షావోమీ 14 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్ బేస్​​ వేరియంట్​ ధర సుమారు రూ. 50వేలుగా ఉండొచ్చు. టాప్​ వేరియంట్​ ధర రూ. 60వేలు దాటొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే.. ప్రస్తుతం ఈ ఫీచర్స్​పై అంచనాలు మాత్రమే ఉన్నాయి. ఫీచర్స్​, ధరపై సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

తదుపరి వ్యాసం