తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi 13 Ultra Vs Samsung Galaxy S23 Ultra : ఈ రెండు ‘అల్ట్రా’ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Xiaomi 13 Ultra vs Samsung Galaxy S23 Ultra : ఈ రెండు ‘అల్ట్రా’ ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

25 April 2023, 7:59 IST

google News
    • Xiaomi 13 Ultra vs Samsung Galaxy S23 Ultra : శాంసంగ్​ గ్యయాలెక్సీ ఎస్​23 అల్ట్రాకు గట్టి పోటీనిచ్చే విధంగా మార్కెట్​లో ఇటీవలే లాంచ్​ అయ్యింది షావోమీ 13 అల్ట్రా. ఈ నేపథ్యంలో వీటి విశేషాలు తెలుసుకుందాము..
శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రా
శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రా (HT TECH)

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రా

Xiaomi 13 Ultra vs Samsung Galaxy S23 Ultra : స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి కొత్తగా అడుగుపెట్టింది షావోమీ 13 అల్ట్రా. ఈ మోడల్​.. శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రాకి గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు గ్యాడ్జెట్స్​ని పోల్చి, ఏది వాల్యూ ఫర్​ మనీ? అన్నది తెలుసుకుందాము..

షావోమీ 13 అల్ట్రా వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రా- స్పెసిఫికేషన్స్​..

షావోమీ 13 అల్ట్రా, శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రాలో టాప్​- సెంటర్డ్​ పంచ్​ హోల్​ విత్​ కర్వ్​డ్​ సైడ్స్​ ఉన్నాయి. అండర్​ డిస్​ప్లే, ఆప్టికల్​- అల్ట్రాసానిక్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్స్​ లభిస్తున్నాయి. శాంసంగ్​ డివైజ్​కు స్టైలస్​ సపోర్ట్​ కూడా వస్తోంది.

Xiaomi 13 Ultra launch date in India : షావోమీ 13 అల్ట్రాలో లెథర్​ బ్యాక్​ ఉండగా.. శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రాలో గ్లాస్​ రేర్​ ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్స్​ బరువు వరుసగా 227గ్రాములు, 233గ్రాములు.

షావోమీ డివైజ్​లో 6.7 ఇంచ్​ క్యూహెచ్​డీ+ (1440X3200 పిక్సెల్స్​) సీ7 ఎల్​టీపీఓ 3.0 అమోలెడ్​ స్క్రీన్​ ఉంటుంది. డాల్బీ విజన్​ సపోర్ట్​ కూడా లభిస్తోంది.

మరోవైపు శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రాలో 6.8 ఇంచ్​ క్యూహెచ్​డీ+ (1440X3088 పిక్సెల్స్​) డైనమిక్​ అమోలెడ్​ 2X ప్యానెల్​ స్క్రీన్​ ఉంది.

ఇదీ చదవండి:- Vivo T2x vs Samsung Galaxy M14 : వివో టీ2ఎక్స్​- శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం14లో ఏది బెస్ట్​?

షావోమీ 13 అల్ట్రా వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రా- ఫీచర్స్​..

Samsung Galaxy S23 Ultra price in India : షావోమీ స్మార్ట్​ఫోన్​లో 50.3ఎంపీ (ఓఐఎస్​) 1.0 ఇంచ్​ మెయిన్​, 50ఎంపీ అల్ట్రా-వైడ్​, 50ఎంపీ (ఓఐఎస్​) టెలిఫొటో, 50ఎంపీ (ఓఐఎస్​, 5ఎక్స్​) పెరిస్కోప్​, టీఓఎఫ్​ 3డీ సెన్సార్​లు ఉన్నాయి. సెల్ఫీ కోసం 32ఎంపీ కెమెరా లభిస్తోంది.

ఇక శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రాలో 200ఎంపీ (ఓఐఎస్​) మెయిన్​, 12ఎంపీ అల్ట్రా-వైడ్​, 10ఎంపీ (ఓఐఎస్​) పొట్రైట్​, 10ఎంపీ (ఓఐఎస్​) పెరిస్కోప్​ కెమెరా వస్తోంది. సెల్ఫీ కోసం 12ఎంపీ కెమెరా ఉంటుంది.

Xiaomi 13 Ultra price in India : ఈ రెండు డివైజ్​లలోనూ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుంది.

షావోమీ 13 అల్ట్రాలో 12జీబీ ర్యామ్​/258జీబీ స్టోరేజ్​, 16జీబీ/512జీబీ, 16జబీ/1టీబీ వేరియంట్లు ఉన్నాయి. ఇక శాంసంగ్​ ఫోన్​లో 12జీబీ ర్యామ్​/ 256జీబీ స్టోరేజ్​, 12జీబీ/512జీబీ, 12జీబీ/ 1టీబీ వేరియంట్లు ఉన్నాయి.

Samsung Galaxy S23 Ultra specifications : షావోమీ 13లో ఎంఐయూఐ 14తో కూడిన ఆండ్రాయిడ్​ 13.. శాంసంగ్​లో యూఐ 5.1తో కూడిన ఆండ్రాయిడ్​ 13 ఓఎస్​లు ఉన్నాయి. ఈ రెండిట్లోనూ 5000 ఎంహెచ్​ బ్యాటరీ ఉంది. వైఫై- 6ఈ, బ్లూటూత్​ 5.3, జీపీఎస్​, ఎన్​ఎఫ్​సీ, టైప్​-సీ కనెక్టివీ ఫీచర్స్​ ఉన్నాయి.

షావోమీ 13 అల్ట్రా వర్సెస్​ శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రా- ధర..

చైనాలో షావోమీ 13 అల్ట్రా బేస్​ వేరియంట్​ ధర 5,999 సీఎన్​వైగా ఉంది. అంటే సుమారు రూ. 71,600. ఇతర వేరియంట్ల ధరలు సుమారు రూ. 77,500- రూ. 87,100గా ఉన్నాయి.

ఇక శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రా ధరలు రూ. 1,24,999- రూ. 1,34,999- రూ. 1,54,999గా ఉన్నాయి.

షావోమీ 13 అల్ట్రా ప్రస్తుతం చైనాలోనే ఉంది. త్వరలోనే ఇది అంతర్జాతీయ మార్కెట్​లోకి అడుగుపెడుతుందని అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం