తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tri-fold Foldable Phone : ఇది ప్రపంచంలోనే తొలి ట్రై-ఫోల్డ్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​- లాంచ్​ ఎప్పుడంటే..

Tri-fold foldable phone : ఇది ప్రపంచంలోనే తొలి ట్రై-ఫోల్డ్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​- లాంచ్​ ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu

03 September 2024, 12:10 IST

google News
  • Tri-fold foldable phone : హువావే నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ స్క్రీన్ డ్యూయెల్ ఫోల్డింగ్ ఫోన్ రానుందని. దీని లాంచ్​ డేట్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ప్రపంచంలోనే తొలి ట్రై-ఫోల్డ్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్!
ప్రపంచంలోనే తొలి ట్రై-ఫోల్డ్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్! (X.com/Jasonwill101)

ప్రపంచంలోనే తొలి ట్రై-ఫోల్డ్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్!

ఈ ఏడాది మచ్​ అవైటెడ్​ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​లో యాపిల్​ ఐపోన్​ 16 సిరీస్​ ఒకటి. ఈ నెల 9న యాపిల్​ నిర్వహించనున్న గ్లోటైమ్​ 2024 ఈవెంట్​లో ఈ కొత్త సిరీస్​ లాంచ్​కానుంది. మెగా ఈవెంట్​కి యాపిల్​, ఐఫోన్​ లవర్స్​ రెడీ అవుతున్న తరుణంలో ఒక ఆసక్తికర ప్రకటన చేసింది హువావే. ఫోల్డెబుల్ స్మార్ట్ఫోన్లు గతంలో కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్న సమయంలో ఈ దిగ్గజ సంస్థ మరో అడుగు ముందుకేసి ట్రై-ఫోల్డ్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​ని రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సెప్టెంబర్​ 10న ఒక లాంచ్​ ఈవెంట్​ను సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ట్రై ఫోల్డ్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హువావే ట్రై- ఫోల్డ్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్​..

ప్రస్తుతానికి సింగిల్ హింజ్​తో 'ఫోల్డ్', 'ఫ్లిప్' స్టైల్ ఫోన్లను మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా హువావే చాలా కాలంగా డ్యూయెల్ ఫోల్డింగ్ ట్రిపుల్ స్క్రీన్ ఫోల్డెబుల్ ఫోన్​పై పనిచేస్తోంది. సెప్టెంబర్ 10 లాంచ్ ఈవెంట్​ను సైతం ప్రకటించింది. ఇందులో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ స్క్రీన్ డ్యూయెల్ ఫోల్డింగ్ ఫోన్​ని ఆవిష్కరించే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం మనం చూసిన రెండర్ల మాదిరిగానే ఈ ఫోన్ కనిపిస్తే.. ఐఫోన్ 16 సిరీస్​పై ఉన్న ఎగ్జైట్​మెంట్​ని హువావే స్టీల్​ చేస్తుందనడంలో సందేహం లేదు!

హువావే తన సెప్టెంబర్ 10 ఈవెంట్​ను చైనీస్ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ వీబో ద్వారా ప్రకటించింది. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది, కన్స్యూమర్ గ్రూప్ సీఈఓ రిచర్డ్ యూ ప్రకారం, ఈ ఈవెంట్​లో హువావేకి చెందిన "అత్యంత ప్రముఖ, సృజనాత్మక, డిస్రప్టివ్​ ప్రాడక్ట్​" అరంగేట్రం చేస్తుంది. "ఇది చాలా మంది ఆలోచించినా, ఎవరికి సాధ్యం కాని ప్రాడక్ట్​" అని ఎగ్జిక్యూటివ్ చెప్పారు. హువావే ఆ రోజు లాంచ్ చేసే నిర్దిష్ట ఉత్పత్తులను అధికారికంగా పేర్కొనలేదు కానీ ఈ ఈవెంట్ కోసం టీజర్ చిత్రం డ్యూయెల్ ఫోల్డింగ్ ఫోన్​ని స్పష్టంగా సూచిస్తుంది.

ట్రై స్క్రీన్ ఫోన్ ఎలా ఉంటుంది?

హువావే నుంచి ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ స్క్రీన్ డ్యూయెల్ ఫోల్డింగ్​జెడ్ ఆకారంలోకి మడతపెట్టడానికి వీలుగా ఉండే రెండు హింజ్​లతో వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న లీక్స్​ని విశ్వసిస్తే ఈ ఫోన్ 10 ఇంచ్​ డిస్​ప్లేను పొందుతుంది. మడతపెట్టినప్పుడు, ఇది 7.6 ఇంచ్​, 8 ఇంచ్​ పరిమాణాల రెండు స్క్రీన్లను కలిగి ఉండవచ్చు. హువావేకు చెందిన రిచర్డ్ యూతో వేర్వేరు సందర్భాల్లో కనిపించిన ఈ ఫోన్.. సంప్రదాయ ఫోల్డెబుల్ ఫోన్ల కంటే చాలా సన్నగా ఉంటుందని భావిస్తున్నారు.

ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్సే చాలా ఖరీదుగా ఉంటాయి. ఇక ఈ ట్రై- ఫోల్డ్​ స్మార్ట్​ఫోన్​ ధర మరింత ఎక్కువగా ఉంటుందనడంలో సందేహమే లేదు. ఈ మోడల్​కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. డిజైన్​ హైలైట్స్​, ఫీచర్స్​, ధర వంటి వాటిపై లాంచ్​ టైమ్​కి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి..

తదుపరి వ్యాసం