September launches: ఐఫోన్ 16 సిరీస్ తో పాటు సెప్టెంబర్ 2024 లో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..-iphone 16 series motorola razr 50 samsung galaxy s24 fe and more smartphones launching in september 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  September Launches: ఐఫోన్ 16 సిరీస్ తో పాటు సెప్టెంబర్ 2024 లో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

September launches: ఐఫోన్ 16 సిరీస్ తో పాటు సెప్టెంబర్ 2024 లో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Aug 31, 2024, 09:40 PM IST Sudarshan V
Aug 31, 2024, 09:40 PM , IST

ఈ సెప్టెంబర్ నెలలో పలు ప్రీమియం రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. అందులో ముఖ్యమైనవి ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లు. అవి కాకుండా, ఈ సెప్టెంబర్ లో శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ, మోటోరోలా రేజర్ 50 కూడా లాంచ్ అవుతున్నాయి. 

ఐఫోన్ 16 సిరీస్: ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడళ్లతో ఆపిల్ సెప్టెంబర్ నెలలో కొత్త తరం ఐఫోన్ ను విడుదల చేయనుంది. అన్ని స్మార్ట్ ఫోన్ మోడళ్లలో ఏఐ ఫీచర్లు ఉంటాయని, మెరుగైన పనితీరు కోసం కొత్త ఏ18 సిరీస్ చిప్ సెట్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తేదీ సెప్టెంబర్ 10 అని భావిస్తున్నారు.

(1 / 5)

ఐఫోన్ 16 సిరీస్: ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడళ్లతో ఆపిల్ సెప్టెంబర్ నెలలో కొత్త తరం ఐఫోన్ ను విడుదల చేయనుంది. అన్ని స్మార్ట్ ఫోన్ మోడళ్లలో ఏఐ ఫీచర్లు ఉంటాయని, మెరుగైన పనితీరు కోసం కొత్త ఏ18 సిరీస్ చిప్ సెట్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తేదీ సెప్టెంబర్ 10 అని భావిస్తున్నారు.(Apple)

మోటరోలా రేజర్ 50: మోటరోలా  రేజర్ 50 అల్ట్రా లాంచ్ తర్వాత ఇది కొత్త క్లామ్ షెల్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ ను టీజ్ చేయడం ఆల్రెడీ ప్రారంభించింది. ఇది కూడా సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్ సెట్ తో ఈ స్మార్ట్ ఫోన్ భారీ డిస్ ప్లేతో రానుంది.

(2 / 5)

మోటరోలా రేజర్ 50: మోటరోలా  రేజర్ 50 అల్ట్రా లాంచ్ తర్వాత ఇది కొత్త క్లామ్ షెల్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ ను టీజ్ చేయడం ఆల్రెడీ ప్రారంభించింది. ఇది కూడా సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్ సెట్ తో ఈ స్మార్ట్ ఫోన్ భారీ డిస్ ప్లేతో రానుంది.(@motorolaindia)

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ: ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ గురించి అనేక పుకార్లు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్సీసీ) వెబ్సైట్లో ఈ స్మార్ట్ఫోన్ కనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ సుమారు రూ.50,000 ధరకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 

(3 / 5)

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ: ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ గురించి అనేక పుకార్లు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్సీసీ) వెబ్సైట్లో ఈ స్మార్ట్ఫోన్ కనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ సుమారు రూ.50,000 ధరకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. (Samsung )

రెడ్ మీ నోట్ 14 సిరీస్: ఈ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ సెప్టెంబర్ నెలలో చైనాలో అరంగేట్రం చేయనుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో ఈ సిరీస్ లోని స్మార్ట్ ఫోన్లు పనిచేయనున్నాయి. అయితే, మోడల్స్ ఆధారంగా ప్రాసెసర్ మారవచ్చు. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో చైనా లాంచ్ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 

(4 / 5)

రెడ్ మీ నోట్ 14 సిరీస్: ఈ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ సెప్టెంబర్ నెలలో చైనాలో అరంగేట్రం చేయనుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో ఈ సిరీస్ లోని స్మార్ట్ ఫోన్లు పనిచేయనున్నాయి. అయితే, మోడల్స్ ఆధారంగా ప్రాసెసర్ మారవచ్చు. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో చైనా లాంచ్ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. (Redmi)

వివో టి3 అల్ట్రా: వివో ఇటీవల టి3 ప్రో 5జీ మోడల్ ను లాంచ్ చేసింది, ఇప్పుడు వివో టి 3 అల్ట్రాను ప్రకటించే అవకాశం ఉంది. బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్సైట్లలో  ఈ స్మార్ట్ఫోన్ ఇటీవల కనిపించింది. ఈ లీకులతో ఈ స్మార్ట్ఫోన్ ను భారత్లో లాంచ్ చేయనున్నట్లు, సెప్టెంబర్ లో ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు.

(5 / 5)

వివో టి3 అల్ట్రా: వివో ఇటీవల టి3 ప్రో 5జీ మోడల్ ను లాంచ్ చేసింది, ఇప్పుడు వివో టి 3 అల్ట్రాను ప్రకటించే అవకాశం ఉంది. బ్లూటూత్ ఎస్ఐజీ, బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్సైట్లలో  ఈ స్మార్ట్ఫోన్ ఇటీవల కనిపించింది. ఈ లీకులతో ఈ స్మార్ట్ఫోన్ ను భారత్లో లాంచ్ చేయనున్నట్లు, సెప్టెంబర్ లో ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు.(Flipkart)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు