తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp In Multiple Phones: వాట్సాప్ అకౌంట్.. 4 ఫోన్లలోనూ ఇక ఒకే అకౌంట్

WhatsApp in multiple phones: వాట్సాప్ అకౌంట్.. 4 ఫోన్లలోనూ ఇక ఒకే అకౌంట్

HT Telugu Desk HT Telugu

16 November 2022, 15:56 IST

google News
    • WhatsApp in multiple phones: మీ ప్రైమరీ వాట్సాప్ అకౌంట్‌ను 4 డివైజెస్‌లో కనెక్ట్ చేసుకునేలా వాట్సాప్ సరికొత్త ఫీచర్ తెచ్చింది.
వాట్సాప్ యూజర్లు ఇక 4 డివైజెస్‌లో కనెక్ట్ చేసుకోవచ్చు
వాట్సాప్ యూజర్లు ఇక 4 డివైజెస్‌లో కనెక్ట్ చేసుకోవచ్చు

వాట్సాప్ యూజర్లు ఇక 4 డివైజెస్‌లో కనెక్ట్ చేసుకోవచ్చు

మీ వాట్సాప్ అకౌంట్‌ను ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లలో కనెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు సాధ్యమవుతుంది. ప్రస్తుతం బీటా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్‌ను ఒకటి కంటే ఎక్కువ ఫోన్లలో కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలాగే ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లో కూడా కనెక్ట్ చేసుకోగలుగుతారు.

ఈ కొత్త ఫీచర్ సహకారంతో వాట్సాప్ ప్రైమరీ అకౌంట్‌ను రెండో స్మార్ట్‌ఫోన్‌పై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇటీవలి వాట్సాప్ బీటా యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.24.18లో ఈ సౌలభ్యం ఉందని జీఎస్ఎం ఎరీనా తెలిపింది.

వాట్సాప్ యూజర్లు ఇక తమ ప్రైమరీ అకౌంట్‌ను నాలుగు యాండ్రాయిడ్ హాండ్‌సెట్లలో లింక్ చేసుకోవచ్చు. ప్రైమరీ అకౌంట్ మాదిరిగానే మిగిలిన హాండ్‌సెట్లలో కూడా మెసేజ్ ఎన్‌క్రిప్షన్ సహా స్టాండర్డ్ ఫీచర్స్ ఉంటాయి.

బీటా యూజర్లకు ఇలా..

రిజిస్ట్రేషన్ స్క్రీన్‌పై సెట్టింగ్స్ మెనూకు వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూ ద్వారా లింక్ ఏ డివైజ్ ఫీచర్ ఎంచుకుని కంపానియన్ మోడ్‌లో యాక్టివేట్ చేయాలి.

ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను కొద్ది మంది బీటా యూజర్లు మాత్రమే వినియోగిస్తున్నారు. త్వరలోనే వాట్సాప్ తన బీటా యూజర్లందరికీ ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తేనుంది. తాజా వాట్సాప్ బీటా అప్‌డేట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తో లింక్ చేసే ఫీచర్ కలిగి ఉంది. బీటా యూజర్లు సెట్టింగ్ ఆప్షన్‌లో డివైజెస్ టాబ్ నొక్కితే లింక్‌డ్ డివైజెస్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తిచేయడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రక్రియ పూర్తిచేయాలి.

సాధ్యమైనంత త్వరలో యూజర్లందరికీ ఈ కొత్త ఫీచర్ కంపానియన్ మోడ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే ట్యాబ్లెట్‌తో లింక్ చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

నోటిఫికేషన్ ఓవర్‌‌లోడ్ ఫీచర్

వాట్సాప్ మరో ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. యూజర్లు నోటిఫికేషన్ ఓవర్ లోడ్‌ తగ్గించుకోవడానికి గ్రూప్ నోటిఫికేషన్ అలెర్ట్స్ ఆటోమేటిగ్గా మ్యూట్‌లోకి వెళ్లేలా ఈ ఫీచర్ పనిచేస్తుంది. నిర్ధిష్ట సంఖ్యలో నోటిఫికేషన్ల పరిమితి దాటితే అది ఆటోమేటిగ్గా మ్యూట్‌లోకి వెళుతుంది. ఇటీవలే వాట్సాప్ గ్రూప్ సభ్యుల పరిమితిని 256 నుంచి 1,024కు పెంచిన సంగతి తెలిసిందే. అందువల్ల నోటిఫికేషన్ల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ఒక లిమిట్ దాటితే ఆటోమేటిగ్గా మ్యూట్‌లోకి వెళ్లేలా కొత్త ఫీచర్ తేనుంది.

వాబీటా ఇన్ఫో వెల్లడించిన సమాచారం ప్రకారం ఇటీవలి బీటా వెర్షన్ 2.22.23.9లో గ్రూపు యూజర్లు 256 దాటితే ఆటోమేటిగ్గా మ్యూట్‌లోకి వెళ్లేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయ్యింది.

తదుపరి వ్యాసం