Do Not Disturb mode in WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ‘డు నాట్ డిస్టర్బ్’
Do Not Disturb mode in WhatsApp: నిత్యం యూజర్లకు ఉపయోగపడే కొత్త ఫీచర్లను తెరపైకి తెచ్చే వాట్సాప్ తాజాగా మరో అప్ డేట్ తో ముందుకు వచ్చింది. వాట్సాప్ కాల్స్ లో ‘డు నాట్ డిస్టర్బ్’ ను అందుబాటులోకి తేనుంది.
Do Not Disturb mode in WhatsApp: షార్ట్ మెసేజింగ్, ఆడియో, వీడియో కాల్స్, పేమెంట్ ఆప్షన్లతో వినియోగదారులను ఆకట్టుకున్నయాప్ వాట్సాప్(WhatsApp). ఇది ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలను గుర్తిస్తూ, తదనుగుణంగా అప్ డేట్స్ ను తీసుకువస్తుంటుంది. ఫేస్ బుక్, ఇన్ స్టా లతో పాటు వాట్సాప్ యాజమాన్య సంస్థ కూడా మెటా(Meta)నే అన్న విషయం తెలిసిందే.
Do Not Disturb mode in WhatsApp: డు నాట్ డిస్టర్బ్(Do Not Disturb)
బిజిగా ఉన్నప్పుడో, కాల్స్ రిసీవ్ చేసుకునే మూడ్ లేనప్పుడో, నిద్రలో ఉన్నప్పుడో, వర్క్ మూడ్ లో ఉన్నప్పుడో.. కాల్స్ వస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఆ కాల్స్ ను కట్ చేయలేం. రిసీవ్ చేసుకోకుండా వదిలేయలేం. ఈ సమస్య పరిష్కారానికే వాట్సాప్(WhatsApp) కొత్త అప్ డేట్ తో వచ్చింది. ఈ ‘డు నాట్ డిస్టర్బ్(Do Not Disturb)’ అప్ డేట్ ను ఇనేబుల్ చేసుకుంటే, మీకు వచ్చే కాల్స్ అన్నీ నిలిచిపోతాయి. మీ ఫోన్ లోని యాప్ పై “Silenced by Do Not Disturb” అనే లేబుల్ కనిపిస్తుంది. అయితే, ఈ విషయం మీకు(రిసీవర్) మాత్రమే తెలుస్తుంది. మీకు కాల్స్ చేసే వారికి తెలియదు. మీ మిస్డ్ కాల్ లిస్ట్ ఆ కాల్ కనిపిస్తుంది. కానీ మీరు Do Not Disturb మోడ్ లో ఉన్న విషయం మీకు కాల్ చేసే వారికి తెలియదు.
Do Not Disturb mode in WhatsApp: బీటా టెస్టర్లకు మాత్రమే..
ప్రస్తుతానికి ఈ అప్ డేట్ ను కొందరు బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి రానుందని WaBetaInfo వెల్లడించింది. ఈ అప్ డేట్ కు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ను కూడా WaBetaInfo షేర్ చేసింది.
Do Not Disturb mode in WhatsApp: కమ్యూనిటీస్ సహా కొత్త ఫీచర్లు..
వాట్సాప్(WhatsApp) మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది. లార్జ్ గ్రూప్ చాట్స్ ను ఆటోమేటిక్ గా మ్యూట్ చేసే ఆప్షన్, మీ కాంటాక్ట్ లిస్ట్ ద్వారా నేరుగా వాట్సాప్ చాట్ ప్రారంభించడం, రిచ్ లింక్ ప్రివ్యూలను జనరేట్ చేసుకునే అవకాశం.. మొదలైనవి ఆ అప్ డేట్స్ లో కొన్ని. ఇటీవలే వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్లకు ‘కమ్యనిటీస్’ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ లోని వివిధ గ్రూప్ లను అనుసంధానించడం ద్వారా ఈ కమ్యూనిటీ ఫీచర్ పని చేస్తుంది. గ్రూప్ అడ్మిన్స్ మాత్రమే ఈ కమ్యూనిటీస్ ను క్రియేట్ చేయగలరు. అలాగే వారు మాత్రమే ఈ కమ్యూనిటీస్ లో ఏ గ్రూప్ ని చేర్చాలనేది నిర్ణయించగలరు.
టాపిక్