WhatsApp new features : రానున్న 5 కొత్త వాట్సాప్ ఫీచర్స్ ఇవే.. ఓ లుక్కేయండి!
WhatsApp new features : కొత్తగా 5 వాట్సాప్ ఫీచర్స్ రానున్నాయి. వీటితో చాటింగ్ మరింత ఈజీగా మారిపోనుంది. మరి వీటిపై మీరూ ఓ లుక్కేయండి.
WhatsApp new features : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ ఒకటి. ఒక్క ఇండియాలోనే వాట్సాప్‌కు 50కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. ఇక యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ఫేస్బుక్ ఆధారిత వాట్సాప్ ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే కొత్త ఫీచర్లతో యూజర్లను నిత్యం పలకరిస్తుంది. ఈ క్రమంలో.. రానున్న 5 వాట్సాప్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఫీచర్స్ వాట్సాప్ వెబ్, ఫోన్ యాప్‌కు రానున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
చాట్ విత్ యువర్సెల్ఫ్..!
ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు తమకి తాము మెసేజ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో చాట్‌కు 'మెసేజ్ యువర్సెల్ఫ్' ఆఫ్షన్ యాడ్ అవుతుంది. వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో చాట్ విత్ యువర్ ఫోన్ నెంబర్ ఆప్షన్ కూడా ఉండదనుందని వాబీటాఇన్ఫో నివేదిక పేర్కొంది.
గ్రూప్ చాట్స్‌లో ప్రొఫైల్ ఫొటోస్..
WhatsApp latest features : గ్రూప్ చాట్స్లోని వారికి ప్రొఫైల్ ఫొటోలు పెట్టుకునే అవకాశాన్ని కల్పించేందుకు ఓ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది వాట్సాప్. ఈ ఫీచర్‌తో.. గ్రూప్‌లో ఏదైనా మెసేజ్ వస్తే.. ఆ మెసేజ్ పంపిన వారి ప్రొఫైల్ ఫొటో కనిపిస్తుందని సమాచారం. ప్రైవసీ సెట్టింగ్స్ లేదా ప్రొఫైల్ ఫొటో కనిపించకపోతే.. గ్రూప్ చాట్‌లో డీఫాల్ట్ ప్రొఫైల్ దర్శనమిస్తుంది.
మీడియాకు క్యాప్షన్..
మెసేజ్‌లు, వీడియోలు, జిఫ్‌లు, డాక్యుమెంట్లతో పాటు వాటి కింది క్యాప్షన్లు కూడా జత చేసే ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.22.23.15 వర్షెన్‌లో ఇది అందుబాటులో ఉంది. ఇతర డివైజ్‌లకు కూడా త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఇమేజ్‌లకు బ్లర్ ఆప్షన్..
WhatsApp latest news : వాట్సాప్‌లో ఇమేజ్‌లను బ్లర్ చేసే ఆప్షన్ ప్రస్తుతం కొన్ని డెస్క్‌టాప్ బీటా టెస్టర్లకే ఉంది. ఏదైనా ఇమేజ్ పంపిచేడప్పుడు.. అందులోని సున్నితమైన అంశాలను నీట్‌గా బ్లర్ చేసేందుకు ఈ ఆప్షన్ పనికొస్తుంది. ఇందుకోసం రెండు బ్లర్ టూల్స్‌ను వాట్సాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్లర్ సైజ్‌ను కూడా యూజర్లు ఎంచుకోవచ్చు.
డెస్క్‌టాప్‌లో.. మీడియా ఆటో డౌన్లోడ్
డెస్క్‌టాప్‌లో మీడియాను క్లిక్ చేస్తే కానీ ప్రస్తుతం డౌన్లోడ్ అవ్వడం లేదు. దీనికి ఆటో వర్షెన్‌ను ఇచ్చేందుకు మీడియా ప్రయత్నిస్తోంది. ఫొటోలు, వీడియోలు, డాక్యమెంట్లు వంటివి ఆటో డౌన్లోడ్ చేసుకునే విధంగా సెట్టింగ్స్‌లో ఆప్షన్లు తీసుకొస్తుంది వాట్సాప్.
సంబంధిత కథనం
WhatsApp : చాట్‌ని కోల్పోకుండా వాట్సాప్ నెంబర్ మార్చడం ఎలా?
October 23 2022
WhatsApp tricks: వాట్సాప్ లో డిలీటెడ్ మెస్సేజెస్ చదవడం ఎలా?
September 30 2022
WhatsApp Updates: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ల గురించి తెలుసా?
September 03 2022