Reason for WhatsApp’s outage: వాట్సాప్ సేవలు నిలిచిపోవడానికి ఇదే కారణమా?
Reason for WhatsApp’s outage: WhatsApp సేవలు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. వాట్సాప్ ప్రారంభమైన తరువాత ఇంత ఎక్కువ సేపు సేవలు నిలిచిపోవడం ఇదే ప్రథమం.
Reason for WhatsApp’s outage: వాట్సాప్ భారత్ లో అత్యంత ప్రముఖ షార్ట్ మెస్సేజింగ్ యాప్. మెస్సేజింగ్ తో పాటు కాల్స్, వీడియో కాల్స్, పేమెంట్ సదుపాయాలను కూడా ఇది అందిస్తోంది. భారత్ లో వాట్సాప్ కు దాదాపు 50 కోట్ల మంది యూజర్లున్నారు.
Reason for WhatsApp’s outage: రెండు గంటల పాటు..
వాట్సాప్ చరిత్రలోనే తొలిసారి ఎక్కువ సేపు సేవలు నిలిచిపోవడం(WhatsApp outage) మంగళవారం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 2 గంటల పాటు వాట్సాప్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. యూజర్లు మెసేజ్ లను పంపిపంచలేకపోయారు. వాట్సాప్ కు సంబంధించిన ఇతర సేవలు కూడా ఆగిపోయాయి. ఆ తరువాత కూడా కొన్ని గంటల పాటు పాక్షికంగానే సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Reason for WhatsApp’s outage: మెటా(Meta) స్పందన
WhatsApp సేవలు నిలిచిపోవడంపై ఆ తరువాత వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా(Meta) స్పందించింది. వినియోగదారులకు క్షమాపణలు చెబుతూ, సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించింది. దీనిపై తమ నిపుణులు అధ్యయనం చేస్తున్నారని తెలిపింది. సమస్యను గుర్తించామని, దాన్ని పరిష్కరిచామని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందుబాటులోకి వచ్చాయని HT(Hindustan Times) కి వెల్లడించింది. అయితే, ఆ సమస్య ఏమిటో కచ్చితమైన వివరాలను మాత్రం సంస్థ ఇవ్వలేదు.
Reason for WhatsApp’s outage: గత అక్టోబర్ లోనూ..
దాదాపు సంవత్సరం క్రితం సోషల్ మీడియా దిగ్గజ సంస్థల సేవల్లో ఇలాగే అంతరాయం ఏర్పడింది. అప్పడు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
Reason for WhatsApp’s outage: భారత ప్రభుత్వం స్పందన
భారత్ లో WhatsApp సేవలు నిలిచిపోవడంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ outage కి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని బుధవారం ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మెటా సంస్థను ఆదేశించింది. ఈ శాఖ ఆధ్వర్యంలోని Computer Emergency Response Team కు అన్ని వివరాలను అందించాలని ఆదేశించింది.