తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp Chat Themes : వాట్సాప్ కొత్త ఫీచర్ చాట్ థీమ్స్.. ఇక చాటింగ్ భలే సరదాగా ఉంటుంది!

WhatsApp Chat Themes : వాట్సాప్ కొత్త ఫీచర్ చాట్ థీమ్స్.. ఇక చాటింగ్ భలే సరదాగా ఉంటుంది!

Anand Sai HT Telugu

07 October 2024, 23:00 IST

google News
  • WhatsApp Chat Themes : వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా చాట్ థీమ్స్ అనే ఫీచర్‌ను తెచ్చింది. దీనిలో యూజర్లు ఇష్టమైన రంగు, థీమ్‌ను ఎంచుకోవచ్చు.

వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ పేరు చాట్ థీమ్స్. ఇందులో యూజర్లకు 22 డిఫరెంట్ థీమ్స్, 20 కలర్ ఆప్షన్లు ఇస్తున్నారు. యూజర్ల చాటింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పలు థీమ్స్, కలర్ ఆప్షన్లను యూజర్లకు ఇస్తారు. వాట్సప్‌లో కొత్త ఫీచర్ గురించి డబ్ల్యూఏబీటాఇన్ఫో సమాచారం ఇచ్చింది. ఈ ఫీచర్ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తెస్తుంది. చాట్ థీమ్స్ ఫీచర్‌ను కంపెనీ కొంతమంది యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

22 విభిన్న థీమ్‌లు, 20 కలర్ ఆప్షన్ అప్‌డేట్‌లతో కొత్త ఫీచర్ వస్తుంది. వీటిలో వినియోగదారులు తమకు ఇష్టమైన థీమ్ లేదా రంగును ఎంచుకోవడం ద్వారా వాట్సాప్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం వినియోగదారులు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిఫాల్ట్ చాట్ థీమ్‌ను ఎంచుకోవచ్చు. ఇది అన్ని చాట్‌లకు వర్తిస్తుంది. వైవిధ్యాన్ని కోరుకునే వినియోగదారులు చాట్ ఇన్ఫో స్క్రీన్ నుండి ప్రత్యేకమైన కాంటాక్ట్ కోసం వేరే థీమ్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా పర్సనల్, వర్క్, గ్రూప్ చాటింగ్‌లను సులభంగా గుర్తించవచ్చు. దేనికదే సపరేట్‌గా కలర్, థీమ్ ఎంచుకోవచ్చు.

యూజర్ ఎంచుకున్న మెసేజ్ కలర్ ఆధారంగా వాల్ పేపర్‌ను కూడా సెట్ చేసుకుంటారని డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది. ఇది ఎంచుకున్న థీమ్ ఆధారంగా చాట్ మొత్తం రూపాన్ని మార్చేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే యూజర్లు చాట్స్ కోసం వేర్వేరు వాల్ పేపర్లను కూడా సెట్ చేసుకోవచ్చు. రెండు చాట్‌ల థీమ్ ఒకటే అయినా వాల్ పేపర్ కారణంగా రెండూ డిఫరెంట్‌గా కనిపిస్తాయి.

మీరు ఐఓఎస్ యూజర్ అయి ఉండి.. ఈ ఫీచర్ మీ డివైస్‌కు చేరకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యాప్ స్టోర్, టెస్ట్ ఫ్లైట్ యాప్ ద్వారా పరిమిత సంఖ్యలో యూజర్లకు డెలివరీ చేస్తున్నారు. రాబోయే వారాల్లో కంపెనీ దీనిని వినియోగదారులందరికీ అందుబాటులోకి తెస్తుంది. వాట్సాప్ ఐఓఎస్ బీటా యూజర్లు కూడా ఈ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు. విడుదలకు ముందు ఈ ఫీచర్‌ను పరిమిత వినియోగదారులకు అందిస్తోంది. తద్వారా దాని టెస్టింగ్ పూర్తవుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం