World Cup Theme Ganesh Mandap: వ‌ర‌ల్డ్ క‌ప్ థీమ్‌తో వినాయ‌క‌మండ‌పం - వీడియో వైర‌ల్‌-ganesh mandap decoration with world cup theme in madhya pradesh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup Theme Ganesh Mandap: వ‌ర‌ల్డ్ క‌ప్ థీమ్‌తో వినాయ‌క‌మండ‌పం - వీడియో వైర‌ల్‌

World Cup Theme Ganesh Mandap: వ‌ర‌ల్డ్ క‌ప్ థీమ్‌తో వినాయ‌క‌మండ‌పం - వీడియో వైర‌ల్‌

HT Telugu Desk HT Telugu
Sep 20, 2023 11:37 AM IST

World Cup Theme Ganesh Mandap: వ‌ర‌ల్డ్ క‌ప్ థీమ్‌తో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వేసిన వినాయ‌క మండ‌పం క్రికెట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ మండ‌పంలో న‌రేంద్ర మోదీ స్టేడియం సెట్‌తోపాటు టీమిండియా క్రికెట‌ర్ల ఫొటోలు క‌నిపిస్తున్నాయి. ఈ మండ‌పం తాలూకు వీడియో వైర‌ల్ అవుతోంది.

న‌రేంద్ర మోదీ స్టేడియం
న‌రేంద్ర మోదీ స్టేడియం

World Cup Theme Ganesh Mandap: వన్డే వరల్డ్ కప్ మరో ఇర‌వై రోజుల్లో మొద‌లుకానుంది. క్రికెట్ అభిమానుల్లో ఇప్ప‌టికే క్రేజ్ మొద‌లైంది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌రం కోసం అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. త‌మ ఎగ్జైట్‌మెంట్‌ను వివిధ రూపాల్లో ప్ర‌ద‌ర్శిస్తోన్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని క్రికెట్ అభిమానులు వినాయ‌క మండ‌పాన్ని వ‌ర‌ల్డ్ క‌ప్ థీమ్‌తో స్పెష‌ల్‌గా డిజైన్ చేశారు.

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం, గ్యాల‌రీతో పాటు పిచ్‌, వికెట్ల‌ను సెట్ రూపంలో వేశారు. ఈ సెట్ ముందు భాగంలో టీమిండియా క్రికెట‌ర్ల ఫొటోల‌ను అంటించారు.

విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌, జ‌డేజాతో పాటు మిగిలిన క్రికెట‌ర్ల ఫొటోలు ఇందులో క‌నిపిస్తున్నాయి. స్టేడియం సెట్‌ను లైట్స్‌తో అందంగా అలంక‌రించారు. వినాయ‌కుడి అశీర్వాదంతో త‌ప్ప‌కుండా ఈ ఏడాది ఇండియా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను గెలుస్తుంద‌ని కొటేష‌న్స్ రాశారు.

వ‌ర‌ల్డ్ క‌ప్ థీమ్‌తో డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన వినాయ‌క మండ‌పం క్రికెట్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వినాయ‌క‌మండ‌పం తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కాగా వ‌న్డే వ‌ర‌ల్డ్ అక్టోబ‌ర్ 5 నుంచి మొద‌లుకానుంది. తొలిపోరులో న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ త‌ల‌ప‌డ‌నుంది. టీమిండియా త‌న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్ట‌బోతున్న‌ది. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ అక్టోబ‌ర్ 8న చెన్నై వేదిక‌గా జ‌రుగ‌నుంది.

WhatsApp channel