తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Maruti Suzuki Swift : కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​, డిజైర్​లో కనిపించే మార్పులు ఇవే..!

2024 Maruti Suzuki Swift : కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్​, డిజైర్​లో కనిపించే మార్పులు ఇవే..!

Sharath Chitturi HT Telugu

24 March 2024, 18:20 IST

    • 2024 Maruti Suzuki Swift : మారుతీ సుజుకీ స్విఫ్ట్​, మారుతీ సుజుకీ డిజైర్​ల అప్డేటెడ్​ వర్షెన్​లు లాంచ్​కి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిలో కనిపించ మార్పులపై అంచనాలను ఇక్కడ తెలుసుకోండి.
మారుతీ సుజుకీ స్విఫ్ట్​..
మారుతీ సుజుకీ స్విఫ్ట్​..

మారుతీ సుజుకీ స్విఫ్ట్​..

2024 Maruti Suzuki Dzire : మారుతీ సుజుకీకి బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​గా కొనసాగుతున్నాయి స్విఫ్ట్​, డిజైర్​. వీటికి.. కొత్త వర్షెన్​లు రాబోతున్నట్టు గత కొంతకాలంగా టాక్​ నడుస్తోంది. పైగా.. ఈ రెండు వెహికిల్స్​కి చెందిన టెస్ట్​ రన్​లు ఇండియన్​ రోడ్లపై జరుగుతూనే ఉన్నాయి. రానున్న నెలల్లో వీటి లాంచ్ జరుగుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్​, 2024 మారుతీ సుజుకీ డిజైర్​లో కనిపించే మార్పులపై ఉన్న అంచనాలను ఇక్కడ చేసేయండి..

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్- డిజైర్: ఎక్ట్సీరియర్

2024 స్విఫ్ట్​ను ఇప్పటికే జపాన్​లో ఆవిష్కరించింది సుజుకీ. బాడీ పరంగా పెద్దగా ఎలాంటి మార్పులు కనిపించలేదు. అదే ఐకానిక్​ డిజైన్​ని కొనసాగించింది. అయితే ఇందులో కొత్త బంపర్లు, లైట్లు వచ్చాయి. సైడ్​లో కొత్త అలాయ్ వీల్స్, రేర్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. గతంలో ఇవి సీ-పిల్లర్​పై ఉండేవి.

2024 Maruti Suzuki Swift : ఇక సబ్ కాంపాక్ట్ 4-మీటర్​ సెడాన్ అయిన మారుతీ సుజుకీ డిజైర్​ని సంస్థ ఇంకా రివీల్​ చేయలేదు. కానీ స్పై షాట్లను బట్టి చూస్తే.. (ప్రస్తుత వర్షెన్​తో పోల్చుకుంటే) బూట్​ అనేది బాడీవర్క్​లో బాగా ఇంటిగ్రేట్​ అయినట్టు కనిపిస్తోంది. కొత్త టెయిల్ ల్యాంప్స్ అందుబాటులోకి రానున్నాయి. అయితే, హెడ్ ల్యాంప్స్ అలాగే ఉండొచ్చు. బంపర్లలో కొన్ని మార్పులు ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్- డిజైర్: ఇంటీరియర్

2024 స్విఫ్ట్, 2024 డిజైర్ ఇంటీరియర్​ ఒకే విధంగా ఉండొచ్చు. అయితే స్విఫ్ట్​లో బ్లాక్ అండ్ ఆఫ్-వైట్ థీమ్​ కనిపించొచ్చు. డిజైర్​లో లేత గోధుమ- నలుపు థీమ్ ఉండే అవకాశం ఉంది. మొత్తం డ్యాష్ బోర్డ్- క్యాబిన్ ఇప్పుడు బాలెనోని పోలి ఉంటాయి. కాబట్టి, ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్ కోసం కొత్త డయల్స్, అప్డేటెడ్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ రావొచ్చు. అంతేకాక, టెస్టర్​ రన్​ దశలో కనిపించిన 2024 మారుతీ సుజుకీ డిజైర్​లో సన్​ రూఫ్​ దర్శనమిచ్చింది. ఇది ఉంటే మాత్రం.. ఈ సెగ్మెంట్​లో సన్​రూఫ్​ కలిగిన తొలి వెహికిల్​గా నిలిచిపోతుంది డిజైర్​!

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్: ఇంజిన్

Maruti Suzuki Swift on road price in Hyderabad : ఇంజిన్​ విషయానికొస్తే.. సుజుకీ జెడ్ 12ఈ కోడ్ నేమ్ తో కొత్త మూడు సిలిండర్ల, నేచురల్ ఆస్పిరేటెడ్ యూనిట్​ని ఉపయోగిస్తోంది. ఇది గరిష్టంగా 80బీహెచ్​పీ పవర్​ని, 108ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది ప్రస్తుత స్విఫ్ట్ కంటే కొంచెం తక్కువ పవర్​ఫుల్​. ప్రస్తుతం ఉన్న వర్షెన్​లోని ఇంజిన్​.. 88 బిహెహెచ్​పీ పవర్​ని, 113 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. అయితే, కొత్త ఇంజిన్ లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది!

ప్రస్తుతం ఇవి రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. లాంచ్​ డేట్​పైనా కంపెనీ స్పందించాల్సి ఉంది. త్వరలోనే.. ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం