Toyota HyRyder : కొనకుండానే.. టయోటా ‘హైరైడర్’ను మీ సొంతం చేసుకోండిలా!
29 October 2022, 8:05 IST
- Own Toyota HyRyder without buying it : టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను కొనుగోలు చేయకుండానే మీరు మీ సొంతం చేసుకోవచ్చు! ఇది ఎలా అంటే..
టయోటా హైరైడర్
Toyota Urban Cruiser HyRyder : టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. కస్టమర్లు ఈ ఎస్‌యూవీపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టయోటా సంస్థ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు.. కొనుగోలు చేయకుండానే టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు!
ఇలా దక్కించుకోండి..
అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు 'సబ్స్క్రిప్షన్ మోడల్'ను ప్రవేశపెట్టింది టయోటా. ఎస్‌యూవీని కొనుగోలు చేయకుండా.. నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ కారును కస్టమర్లు వినియోగించుకోవచ్చు!
Toyota Urban Cruiser HyRyder subscription model : ఈ ఏడాది సెప్టెంబర్‌లో.. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్.. ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 10.48లక్షల వద్ద ప్రారంభమవుతుంది. అయితే.. సబ్స్క్రిప్షన్ మోడల్లో భాగంగా.. టాప్ ఎండ్ 2డబ్ల్యూడీ నియో డ్రైవ్ ఆటోమెటిక్ వేరియంట్‌ను ఇస్తోంది టయోటా. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 17.09లక్షలు.
సబ్స్క్రిప్షన్ మోడల అనేది కాల వ్యవధి.. ప్రయాణించే కిలోమీటర్లపై ఆధారపడి ఉంటుంది. లీజింగ్ ప్లాట్‌ఫామ్ మైలీజ్లో ఈ కారును ఆఫర్ చేస్తోంది టయోటా. స్కీమ్‌లో భాగంగా.. ఏడాది- నాలుగేళ్ల కాల వ్యవధిని టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను లీజ్‌కు తీసుకొవచ్చు. కాల వ్యవధి కాకపోతే, ప్రయాణించే కిలోమీటర్ల చొప్పున( వార్షికంగా 12,000- 24,000 కి.మీలు) కూడా కారును సొంతం చేసుకోవచ్చు.
Toyota Urban Cruiser HyRyder price : ఏడాదికి 12000 కి.మీలు అని టెన్యూర్ తీసుకుంటే.. నెలకు రూ. 56,473 చెల్లించాల్సి ఉంటుంది. అదే.. నాలుగేళ్ల కాల వ్యవధి (ఏడాదికి 24,000కిమీలు దాటకూడదు) ఆప్షన్ తీసుకుంటే.. నెలకు రూ. 47,729 చెల్లించాలి.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వీ ఏటీ నియో డ్రైవ్ వేరియంట్లో 1.5లీటర్, 4 సిలిండర్ కే15సీ సిరీస్ హైబ్రీడ్ పవర్‌ట్రైన్‌తో కూడిన పెట్రోల్ ఇంజిన్ఉంటుంది. ఇది 102బీహెచ్పీ పవర్, 137ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ దీని సొంతం.
ఈ హైరైడర్.. కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్, టాటా హ్యారియర్‌కు బలమైన పోటీనిస్తోంది.