Toyota Innova Hycross : డాషింగ్ లుక్‌తో టయోటా ఇన్నోవా హైక్రాస్..!
25 October 2022, 11:26 IST
- Toyota Innova Hycross : ఇన్నోవా హైక్రాస్ టీజర్‌ను విడుదల చేసింది టయోటా. వచ్చే నెలలో ఇది లాంచ్ అవుతుందని సమాచారం.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫస్ట్ లుక్
Toyota Innova Hycross : ఇన్నోవా ఎంపీవీ కొత్త వర్షెన్‌ను లాంచ్ చేసేందుకు గత కొంతకాలంగా ప్రణాళికలు రచిస్తోంది టయోటా. దీనికి ఇన్నోవా హైక్రాస్ అని పేరు పెట్టింది. ఇక ఇప్పుడు.. ఈ ఇన్నోవా హైక్రాస్కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది టయోటా ఇండోనేషియా.
ఇన్నోవా హైక్రాస్ ఫ్రంట్ డిజైన్ మాత్రమే ఆ టీజర్లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్నోవా క్రిస్టాకు ఇది భిన్నంగా కనిపిస్తోంది. టయోటా కొరొల్లా క్రాస్ వాహనాన్ని.. ఈ ఇన్నోవా హైక్రాస్ ఫ్రంట్ డిజైన్ పోలి ఉంది. అప్ రైట్ హెక్సాగొనల్ గ్రిల్ ఇందులో ఉంటుంది. దీనితో ఇన్నోవా హైక్రాస్ అపియరెన్స్ మరింత డాషింగ్‌గా మారుతుంది. బానెట్‌ను చూస్తే.. కారు ఎంపీవీ అయినప్పటికీ, ఎస్యూవీ లుక్ వస్తోంది. ఇన్నోవా హైక్రాస్లో మోనోకోక్యూ ఛాసీస్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇదే నిజమైతే.. వాహనం హ్యాండ్లింగ్, రైడ్ మెరుగ్గా ఉంటుంది. అదే సమయంలో బాడీ రోల్ తగ్గుతుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెహికల్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఫీచర్స్ ఏంటి?
Toyota Innova Hycross features : ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. టయోటా ఇన్నోవా హైక్రాస్లో 360డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, రెండో రోలో కుర్చీలకు ఒట్టోమన్ ఫంక్షనింగ్ సిస్టెమ్ ఉంటాయని సమాచారం. ఈ కారు పొడవు 4.7మీటర్లు, వీల్‌బేస్ 2,850ఎంఎం ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
ఇక వచ్చే నెలలో టయోటా ఇన్నోవా హైక్రాస్ అంతర్జాకీయ మార్కెట్లోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది.
Toyota Innova Hycross teaser : ఇన్నోవా హైక్రాస్‌ను ఇండియా రోడ్ల మీద ఇప్పటికే టెస్ట్ చేస్తోంది టయోటా. ఇన్నోవా క్రిస్టాతో పాటు ఇన్నోవా హైక్రాస్‌ను కూడా సేల్ చేయాలని చూస్తోంది. అయితే.. కొత్త వర్షెన్‌లో పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఉంటుందని సమాచారం. కాకపోతే.. కాస్త హైబ్రీడ్ సిస్టెట్ టచ్‌ను ఇవ్వొచ్చు. ఇన్నోవా క్రిస్టా కూడా పెట్రోల్ వర్షెన్‌లోనే అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజిన్‌కి సంబంధించి బుకింగ్స్‌ను సంస్థ తీసుకోవడం లేదు.
సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే.. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫీచర్స్, ధర, లాంచ్ డేట్ వంటి వివరాలు స్పష్టమవుతాయి.