Vivo Y200e launch: పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ తో ఇండియాలో లాంచ్ అయిన వివో వై200ఈ
22 February 2024, 17:41 IST
Vivo Y200e launch: లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో వై ని వివో సంస్థ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో శక్తిమంతమైన స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ఓసీ ని పొందుపర్చారు. ఈ వివో వై 200ఈ 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు.
వివో వై 200 ఈ స్మార్ట్ ఫోన్
Vivo Y200e launched in India రూ.19,999 ప్రారంభ ధరతో వివో తన మిడ్ రేంజ్ వివో వై200ఈ (Vivo Y200e) స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. ప్రస్తుతం Vivo.com, ఫ్లిప్ కార్ట్ లలో ప్రీ-ఆర్డర్ కు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ త్వరలో ఆఫ్ లైన్ స్టోర్లకు రానుంది.
వివో వై 200 ఈ ధర
భారత్ లో లేటెస్ట్ గా లాంచ్ చేసిన వివో వై 200 ఈ (Vivo Y200e) స్మార్ట్ ఫోన్ ధరలను వివో రూ. 20 వేల కేటగిరీలో నిర్ణయించింది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .19,999 గా, 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .20,999గా నిర్ణయించింది. సాఫ్రాన్ డిలైట్, బ్లాక్ డైమండ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ ను ప్రస్తుతం వివో వెబ్ సైట్ లో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వినియోగదారులు హెచ్ డీ ఎఫ్ సీ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగిస్తే, రూ .1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.
వివో వై200ఈ స్పెసిఫికేషన్లు
వివో వై200ఈ (Vivo Y200e) స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ + ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4-నానోమీటర్ ప్రాసెస్ పై నిర్మించిన ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ ఓసి ని పొందుపర్చారు. అలాగే, ఇంటెన్సివ్ గ్రాఫిక్స్ కార్యకలాపాల కోసం అడ్రినో 613 జీపీయూ కూడా ఉంది. ఇందులో 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్ ఆప్షన్ ఉన్నాయి. డెడికేటెడ్ మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
డ్యుయల్ కెమెరా సెటప్
వివో వై 200 ఈ (Vivo Y200e) స్మార్ట్ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. వివో వై 200ఇ ఫోన్ లో 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీనిని 44 వాట్ ఛార్జర్ ద్వారా త్వరగా రీఛార్జ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత వివో సొంత ఫన్ టచ్ ఓఎస్ 14 పై ఇది పనిచేస్తుంది. స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ కూడా ఉంది. అదనంగా, అవసరమైన అన్ని 5జీ బ్యాండ్లు, డ్యూయల్ 4జీ వీవోఎల్టీఈ సపోర్ట్, వైఫై 5.1, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి ప్రత్యేకతలున్నాయి.