Vivo G2 : బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో జీ2 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే..-vivo g2 with 13 megapixel rear camera launched check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo G2 : బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో జీ2 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే..

Vivo G2 : బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో జీ2 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే..

Sharath Chitturi HT Telugu
Jan 21, 2024 04:01 PM IST

Vivo G2 : Vivo G2 : బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో జీ2 లాంచ్​ అయ్యింది. ఈ గ్యాడ్జెట్​ ధర, ఫీచర్స్​ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో జీ2 లాంచ్​..
బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో జీ2 లాంచ్​.. (gsmarena)

Vivo G2 price : దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో.. సరికొత్త స్మార్ట్​ఫోన్​ని చైనాలో లాంచ్​ చేసింది. దాని పేరు వివో జీ2. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​. ఈ నేపథ్యంలో మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో జీ2 ఫీచర్స్​ ఇవే..

వివో జీ2లో.. 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.56 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. దీని స్క్రీన్​ టు బాడీ రేషియో 89.67శాతం. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్​ ఉంది. 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 15వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీనికి లభిస్తోంది. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో స్మార్ట్​ఫోన్​.. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 3 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.

Vivo G2 launch date in India : ఈ వివో జీ2లో డ్యూయెల్​ నానో సిమ్​ ఉంటుంది. ఇక ఈ మొబైల్​లో 13ఎంపీ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 5 ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. కెమెరా ఫీచర్స్​ చూస్తే చాలు.. ఇది పర్ఫెక్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ అని తెలిసిపోతుంది!

వివో జీ2 ఒక 5జీ స్మార్ట్​ఫోన్​. ఇందులో 5జీతో పాటు 4జీ ఎల్​టీఈ, వైఫై-5, బ్లూటూత్​ 5.1, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​ సీ పోర్ట్​, 3.5ఎంఎం ఆడియో జాక్​ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి. యాక్సెలరోమీటర్​, యాంబియెంట్​ లైట్​ సెన్సార్​, ప్రాక్సిమిటీ సెన్సార్​, ఈ-కంపాస్​, ఫ్లికర్​ సెన్సార్​లు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ వివో జీ2 స్మార్ట్​ఫోన్​ మెజర్​మెంట్స్​.. 165.74x75.43x8.09ఎంఎం. బరువు 186గ్రాములు.

వివో జీ2 ధర ఎంతంటే..

Vivo G2 features : వివో జీ2 4జీ ర్యామ్​- 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,199 యువాన్​లు. అంటే సుమారు రూ. 14వేలు.

6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,499 యువాన్​లు. అంటే సుమారు రూ. 17,500.

ఇక 8జీబీ ర్యామ్​- 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,599 యువాన్​లు. అంటే సుమారు రూ. 18,700.

8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,899 యువాన్​లు. అంటే సుమారు రూ. 22వేలు.

Best Budget friendly vivo smartphones : కాగా.. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో జీ2 స్మార్ట్​ఫోన్​ ఇండియా లాంచ్​పై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం