Vivo Y200 5G : వివో వై200 5జీ లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలివే!
Vivo Y200 5G : వివో వై200 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్, ధర వివరాలు..
Vivo Y200 5G launch date in India : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సరికొత్త గ్యాడ్జెట్‌ను లాంచ్ చేసింది వివో సంస్థ. దీని పేరు వివో వై200 5జీ. ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వివో వై200 ఫీచర్స్ ఇవే..
ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌లో టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్లు ఉంటాయి. ఈ మోడల్ బరువు 190గ్రాములు, థిక్నెస్ 7.69ఎంఎం. ఈ డివైజ్‌లో 120హెచ్‌జెడ్‌తో కూడిన 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంటుంది. హెచ్డీఆర్10+, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 800 నిట్స్ బ్రైట్నెస్ లెవల్స్ వంటివి ఉన్నాయి.
Vivo Y200 5G price in India : ఇక ఈ మోడల్ రేర్‌లో 64ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్ సెన్సార్, స్మార్ట్ ఔరా లైట్ ఫ్లాష్ యూనిట్లు వస్తున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ వివో గ్యాడ్జెట్లో 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తోంది.
ఈ వివో వై200 5జీలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ దీని సొంతం. 8జీబీ వర్చ్యువల్ ర్యామ్ సపోర్ట్ కూడా లభిస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 సాఫ్ట్‌వేర్‌పై ఈ మోడల్ పనిచేస్తుంది. 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ దీని సొంతం. టైప్- సీ పోర్ట్, 5జీ, డ్యూయెల్ సిమ్ స్లాట్, వైఫై-5, బ్లూటూత్ 5.1, జీబీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే..
Vivo Y200 5G price : ఇండియాలో వివో వై200 5జీ.. రెండు కలర్స్‌లో అందుబాటులోకి వచ్చి. అవి డెసర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్. ఈ మొబైల్ ధర రూ. 21,999గా ఉంది. లాంచ్ ఆఫర్స్ కింద.. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డులపై రూ. 2వేల వరకు తగ్గింపు లభిస్తోంది.
వివో ఇండియా అధికారి వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
వివో వై33టీ ఫీచర్స్ చూశారా..?
వివో సంస్థ.. ఇటీవలో ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దాని పేరు వివో వై33టీ. చైనాలో ఈ గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ జీ85 ప్రాసెసర్ ఉంటుంది. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ దీని సొంతం. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌కి ఇది డీసెంట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం