Vivo Y18t : సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన వివో కొత్త ఫోన్.. ధర కేవలం రూ.9,499 మాత్రమే
12 November 2024, 16:30 IST
Vivo Y18t Launched : వివో కొత్త స్మార్ట్ ఫోన్ 'వై18టీ'ని తాజాగా విడుదల చేసింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర కేవలం రూ.9,499 మాత్రమే.
వివో వై18టీ
10 వేల కంటే తక్కువ బడ్జెట్లో మంచి బ్యాటరీ, మంచి కెమెరా, పెద్ద డిస్‌ప్లే ఉన్న ఫోన్ కావాలనుకుంటే.. వివో వై18టీ మీకు బెటర్ ఆప్షన్. కొత్తగా ఈ ఫోన్‌ను వివో సైలెంట్‌గా ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త వివో ఫోన్ ఐపీ 54 రేటింగ్ బిల్డ్, రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపు ఉంటుంది. దీని గురించి సమాచారం తెలుసుకుందాం..
భారతదేశంలో వివో వై18టీ కేవలం 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ అయింది. దీని ధర రూ .9,499గా పెట్టారు. ఈ ఫోన్ జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.
వివో వై18టీ బేసిక్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. డ్యూయల్ సిమ్ (నానో)తో వస్తున్న ఈ ఫోన్ ఫన్ టచ్ ఓఎస్ 14 ఆధారిత ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్ (720×1612 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269 పిపిఐ పిక్సెల్, 840 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఇస్తుంది. 4 జీబీ LPDDR4X ర్యామ్, యూనిసోక్ టీ612 చిప్‌సెట్‌తో ఈఎంఎంసీ 5.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆన్ బోర్డ్ మెమరీని 8 జీబీ వరకు పెంచుకునేందుకు ఎక్స్ టెండెడ్ ర్యామ్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. దీని స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.
50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ఫోన్లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 62.53 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయం, 6.8 గంటల వరకు పబ్జీ ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు.
వివో వై18టీలో బ్లూటూత్ 5.2, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఓటీజీ, వైఫై, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, మోటార్ గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఇందులో బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ ఐపీ54 రేటింగ్‌తో వస్తుంది.