Vivo Phone Discount : వివో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్.. రూ.10 వేలకే.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి
Vivo T3 Lite Discount : పండుగ సీజన్ కావడంతో ఫోన్లపై మంచి మంచి డిస్కౌంట్లు వస్తున్నాయి. అందులో భాగంగా వివో టీ3 లైట్ 5జీ ఫోన్ మీద మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఫోన్‌ను పదివేలలోపు ధరతో మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫెస్టివ్ సేల్‌లో కొన్ని ఎంపిక చేసిన కొత్త మొబైల్‌లు భారీ తగ్గింపు ధరలకు వస్తున్నాయి. కస్టమర్లను ఆకర్శిస్తున్నాయి. వివో టీ3 లైట్ 5జీ ఫోన్ కూడా మంచి డిస్కౌంట్‌తో వస్తుంది. 27 శాతం ప్రత్యక్ష తగ్గింపు రేటుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఈ మొబైల్ 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ. 10,499గా ఉంది. దీనితో పాటు, కస్టమర్ బ్యాంక్ ఆఫర్‌ను కూడా పొందినట్లయితే రూ.9,499కి అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వివో నుండి వచ్చిన ఈ ఫోన్ వైబ్రంట్ గ్రీన్, మెజెస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు 5,000 mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్‌ను కూడా పొందుతుంది.
వివో టీ3 లైట్ 5జీ ఫోన్ 2400 × 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ అమోల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఎంపికను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్షన్ 6300 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది.
వివో టీ3 లైట్ 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ, 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది. మొదటి కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్. అలాగే ఈ ఫోన్ సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో అమర్చి ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాతో వస్తుంది.