Budget Smartphone : బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే సెల్ఫీ కెమెరా-new smartphone at budget range come up with 16 gb ram and 32 mp selfie camera check affordable price here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Smartphone : బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే సెల్ఫీ కెమెరా

Budget Smartphone : బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే సెల్ఫీ కెమెరా

Anand Sai HT Telugu
Updated Feb 03, 2025 11:27 AM IST

Budget Smartphone 15k : బడ్జెట్ సెగ్మెంట్‌లో ఐటెల్ ఎస్ 25 అల్ట్రా 4జీని త్వరలో అధికారికంగా లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు, డిజైన్‌కు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఇది వస్తుంది.

ఐటెల్ ఎస్25 అల్ట్రా
ఐటెల్ ఎస్25 అల్ట్రా

దేశీయ టెక్ కంపెనీ ఐటెల్ త్వరలో బడ్జెట్ విభాగంలో ఐటెల్ ఎస్ 25 అల్ట్రా 4జీని అధికారికంగా లాంచ్ చేయనుంది. దానికంటే ముందుగానే ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లతోపాటుగా ఇతర వివరాలు బయటకు వచ్చాయి. లీకైన ఫోటోలో ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో రానుందని తెలుస్తోంది. ఐటెల్ ఎస్ 25 అల్ట్రా 4జీలో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా యూనిట్, డిస్ ప్లేలో హోల్ పంచ్ కటౌట్ ఉన్నాయి. యూనిసోక్ టీ620 ఎస్ వోసీ ప్రాసెసర్, ఐటెల్ ఎస్ 25 అల్ట్రా 4జీలో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.

టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ (@passionategeekz) ఐటెల్ ఎస్ 25 అల్ట్రా మార్కెటింగ్ కంటెంట్, రెండర్లను పోస్ట్ చేసింది. స్పెసిఫికేషన్లు, డిజైన్లను తెలిపింది. భారత్‌లో ఈ 4జీ హ్యాండ్సెట్ ధర రూ.15,000 లోపే ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొంది. ఇతర మార్కెట్లలో దీని ధర రూ.13,500 వరకు ఉంటుంది.

ఐటెల్ ఎస్ 25 అల్ట్రా బ్లాక్, బ్లూ, టైటానియం రంగుల్లో హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్ తో వస్తుంది. హ్యాండ్ సెట్ ఎగువ ఎడమ మూలలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఈ ఫోన్ వెనుక భాగం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాను పోలి ఉంటుంది.

లీకుల ప్రకారం ఐటెల్ ఎస్ 25 అల్ట్రా 6.78 అంగుళాల 3డి కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,400నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 16 జీబీ వరకు ర్యామ్‌ను అందించనున్నారు.

50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉండనుంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం ముందువైపు అదిరిపోయేలా 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఐటెల్ ఎస్ 25 అల్ట్రా 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని మందం 6.9 మిల్లీమీటర్లు, బరువు 163 గ్రాములుగా ఉంది. ఐటెల్ ఎస్ 25 అల్ట్రా ఐపీ 64-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌కు 60 నెలల ఫ్లూయెన్సీ సర్టిఫికేట్ కూడా ఉంది.

Whats_app_banner