తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Flagship Smartphones : ఈ రెండు వివో ప్రిమియం స్మార్ట్​ఫోన్స్​కి సూపర్​ డిమాండ్​- మరి ఏది బెస్ట్​?

Best flagship smartphones : ఈ రెండు వివో ప్రిమియం స్మార్ట్​ఫోన్స్​కి సూపర్​ డిమాండ్​- మరి ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

21 December 2024, 12:10 IST

google News
  • వివో ఎక్స్200 ప్రో వర్సెస్ వివో ఎక్స్100 ప్రో.. మీరు కొత్త తరం వివో ఎక్స్ సిరీస్ మోడల్​కు అప్​గ్రేడ్ అవ్వాలో లేదో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ వివో ఎక్స్100 ప్రో:
వివో ఎక్స్200 ప్రో వర్సెస్ వివో ఎక్స్100 ప్రో: (Vivo)

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ వివో ఎక్స్100 ప్రో:

వివో తన కొత్త ఫ్లాగ్​షిప్ ఎక్స్ సిరీస్ స్మార్ట్​ఫోన్స్​ని భారతదేశంలో లాంచ్ చేసింది. రెండు కొత్త మోడళ్లు ఆకట్టుకున్నప్పటికీ, వివో ఎక్స్200 ప్రో దాని కెమెరా సామర్థ్యాలు, కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్​సె్​తో దాని పనితీరు కోసం చాలా ప్రజాదరణ పొందుతోంది. అయితే, గత ఏడాది వివో ఎక్స్100 ప్రో కంటే కొత్త తరం మోడల్ నిజంగానే బెటర్​గా ఉందా? ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ని పోల్చి, ఈ రెండింటిలో ఏది బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ వివో ఎక్స్100 ప్రో: డిజైన్..

వివో ఎక్స్​200 ప్రో, వివో ఎక్స్100 ప్రో గ్లాస్ బాడీ, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్​కి సపోర్ట్​ ఇచ్చే ఒకే రకమైన డిజైన్​తో వస్తాయి. అయితే, ఎక్స్200 ప్రో ఫ్లాట్ స్క్రీన్, కెమెరాలో మెటల్ రింగ్, మంచి గ్రిప్ వంటి కొన్ని గుర్తించదగిన అప్​గ్రేడ్స్​తో వచ్చింది. అదనంగా, కొత్త తరం వాటర్ జెట్ రెసిస్టెన్స్ కోసం అదనపు ఐపీ 69 రేటింగ్ పొందింది.

6.78 ఇంచ్​ డిస్​ప్లే, 1.5కే+ రిజల్యూషన్, 8టీ ఎల్టీపీవో టెక్నాలజీ వంటి ఫీచర్లు ఈ రెండు స్మార్ట్​ఫోన్లలో ఉన్నాయి. అయితే ఎక్స్200 ప్రోలో ఫుల్లీ కర్వ్డ్ డిస్​ప్లేకు బదులుగా క్వాడ్ కర్వ్డ్ డిస్​ప్లే ఉంది. ఇది కొత్త అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్​ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్స్100 ప్రో కంటే మెరుగైన ఆర్మర్డ్ గ్లాస్​తో వస్తుంది.

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ వివో ఎక్స్ 100ప్రో: కెమెరా..

వివో ఎక్స్200 ప్రోలో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్​వైటీ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జెఎన్ 1 అల్ట్రావైడ్ కెమెరా, 3.7 ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో 200 మెగాపిక్సెల్ జేఐఎస్ఎస్ ఏపీఓ టెలీఫోటో కెమెరా ఉన్నాయి.

వివో ఎక్స్00 ప్రోలో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 989 ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 4.3 రెట్ల ఆప్టికల్ జూమ్​తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. స్పెసిఫికేషన్లలో జూమింగ్ సామర్థ్యాలు మెరుగ్గా కనిపించినప్పటికీ, ఎక్కువ రిజల్యూషన్, కొత్త జేయిస్ఎస్ ఏపీఓ సర్టిఫికేషన్​తో పర్ఫార్మెన్స్​ విషయంలో వివో ఎక్స్200 ప్రోలో మెరుగైన ఫలితాలను అందిస్తుంది.

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ వివో ఎక్స్100 ప్రో: పర్ఫార్మెన్స్​..

వివో ఎక్స్200 ప్రో ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, 4.0 స్టోరేజ్​తో కనెక్ట్​ చేసిన కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్​​తో పనిచేస్తుంది. మెరుగైన కెమెరా పర్ఫార్మెన్స్​ కోసం కొత్త వివో వీ3 + ఇమేజింగ్ చిప్సెట్​ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వివో ఎక్స్100 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్​పై పనిచేస్తుంది. అయితే ఇందులో ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, వివో వీ3 చిప్ కూడా ఉన్నాయి.

లాంగ్​లాస్టింగ్​ పర్ఫార్మెన్స్​ కోసం, వివో ఎక్స్200 ప్రో 90వాట్ ఫ్లాష్​ఛార్జ్ సపోర్ట్​తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. వివో ఎక్స్100 ప్రో 100 వాట్ ఫ్లాష్​ఛార్జ్ సపోర్ట్​తో 5400 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

వివో ఎక్స్200 ప్రో వర్సెస్ వివో ఎక్స్100 ప్రో: ధర..

వివో ఎక్స్200 ప్రో 16 జీబీ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 94,999. వివో ఎక్స్100 ప్రో 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.96,999గా నిర్ణయించారు.

తదుపరి వ్యాసం