Budget Smartphones : రూ.7,200లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. 50ఎంపీ కెమెరా.. ఈ డీల్ మరికొన్ని రోజులే
Budget Smartphones : బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి మంచి ఛాన్స్ ఉంది. రూ.7200లోపు ధరతో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. ఆ ఆఫర్స్ ఏంటో చూద్దాం..
దసరా, దీపావళి సేల్‌లో బెస్ట్ ఆఫర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కొనడం మిస్ అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో పండుగ సేల్స్ ముగిసిన తర్వాత బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 7న ప్రారంభమైన ఈ సేల్ నవంబర్ 13 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. అదే సమయంలో బడ్జెట్ తక్కువగా ఉన్నా ఈ సేల్ లో ఆప్షన్లకు కొదవలేదు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ డేస్ సేల్లో అందుబాటులో ఉన్న రెండు చౌకైన స్మార్ట్‌ఫోన్ల గురించి చూద్దాం.. 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ ఉన్న ఈ ఫోన్లను మీరు రూ.7200 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో మీరు ఈ డివైజ్‌లను క్యాష్ బ్యాక్‌తో తీసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉన్న ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
రెడ్‌మీ 13సీ
రెడ్‌మీ 13సీ 4జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,199గా ఉంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి ఈ సేల్‌లో ఫోన్ కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐలపై కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం ఈ ఫోన్‌లో గొరిల్లా గ్లాస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందిస్తోంది. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు.
పోకో సీ65
పోకో సీ65 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999. 5 శాతం క్యాష్ బ్యాక్‌తో ఈ ఫోన్ సెల్‌లో లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో చెల్లించాలి. రూ.247 ప్రారంభ ఈఎంఐతో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో కంపెనీ 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అందిస్తోంది.
మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 2 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ కూడా ఉంది. ఫోన్ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్.
సంబంధిత కథనం