తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Valentine’s Day Special: భారతీయులకు ఈ ఐదు కార్లంటే ప్రత్యేకమైన ప్రేమ

Valentine’s Day special: భారతీయులకు ఈ ఐదు కార్లంటే ప్రత్యేకమైన ప్రేమ

HT Telugu Desk HT Telugu

14 February 2024, 13:29 IST

  • Valentine’s Day special: భారతీయుల హృదయాల్లో చిన్న కార్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే, SUVల పాపులారిటీ క్రమంగా పెరుగుతోంది. దాంతో, చిన్న కార్ల స్థానాన్ని క్రమంగా ఎస్ యూ వీలు ఆక్రమించుకుంటున్నాయి. అయినా, భారతీయులు అత్యంత ప్రేమించే కార్.. అంటే ఈ 5 కార్లే గుర్తుకువస్తాయి. 

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు

Best selling cars in India: గత సంవత్సరం పండుగ సీజన్ నుంచి భారతీయ కార్ మార్కెట్ విపరీతమైన వృద్ధిని సాధించింది. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, SUVలు.. ఒకదానిని మించి మరొకటి అత్యుత్తమ సేల్స్ సాధించాయి. కొత్త అప్ డేట్ లతో వచ్చిన కొత్త మోడల్‌లు భారతీయ కొనుగోలుదారులలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. అయితే, భారతీయులు ప్రత్యేక ప్రేమతో కనిపించే కొన్ని కార్లు ఉన్నాయి. ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌లు. అవి కొత్త వాహనాల ద్వారా ఎదురయ్యే సవాళ్లను తట్టుకున్నవి. అధిక వాల్యూమ్‌లలో విక్రయాలు కొనసాగిస్తున్న అటువంటి ఐదు కార్ల గురించి ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Naga Chaitanya Porsche : రూ. 3.5 కోట్లు పెట్టి పోర్షే కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్​లో ఇదే ఫస్ట్​!

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Maruti Suzuki Swift: మారుతి సుజుకీ స్విఫ్ట్

భారతీయులు అత్యంత ప్రేమించే కార్లలో మొదటి స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఉంటుంది. దశాబ్దాల క్రితం లాంచ్ చేసిన నాటి నుంచి అత్యుత్తమ అమ్మకాలతో ఈ కార్ దూసుకుపోతోంది. ఈ Maruti Suzuki Swift హ్యాచ్‌బ్యాక్ 2023లో దేశవ్యాప్తంగా రెండు లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయింది. ఈ సంవత్సరం కొత్త అవతార్‌లో ఈ కార్ మార్కెట్లోకి రానుంది. స్విఫ్ట్‌ని ఆకర్షణీయంగా మార్చేది దాని కాంపాక్ట్ సైజు, పెప్పీ ఇంజిన్, ధర. భారత్ లో విశాలమైన రోడ్లు అంతగా కనిపించవు. పార్కింగ్ కూడా ఒక సమస్య. ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఇమిడిపోయిన కార్ స్విఫ్ట్. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. సీఎన్జీ వేరియంట్ కూడా ఉంది. స్విఫ్ట్ ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 9.03 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Maruti Suzuki WagonR: మారుతి సుజుకీ వేగన్ ఆర్

మారుతీ సుజుకీకి చిన్న కార్లే బలం. ఒకప్పుడు భారతీయ ఆటో పరిశ్రమకు వెన్నెముకగా ఈ సెగ్మెంట్ నిలిచింది. SUV మార్కెట్ లో మాత్రం మారుతి సుజుకీ కొంత వెనుకబడింది. కానీ, హ్యాచ్ బ్యాక్ విభాగంలో బాక్సీ హ్యాచ్‌బ్యాక్ గా వేగన్ ఆర్ (Maruti Suzuki WagonR) భారతీయులను విశేషంగా ఆకట్టుకుంది. వ్యక్తిగత వాహన యజమానులు, CNG వెర్షన్‌ను ఇష్టపడేవారు ఈ కార్ ను కొనుగోలు చేశారు. 2023 లో రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ డెలివరీ చేయబడిన రెండవ కారుగా నిలిచింది. ఇది 1.0-లీటర్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తుంది. ఈ మోడల్ ఇంతగా ప్రజాదరణ పొందడానికి దీని CNG ఎంపిక కూడా ఒక ముఖ్యమైన అంశం. భారతదేశంలో కొనుగోలు చేయడానికి ఇది అత్యంత సరసమైన కారు. ఈ కార్ రూ. 4.39 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర నుంచి లభిస్తుంది.

Maruti Suzuki Baleno: మారుతి సుజుకీ బాలెనో

న్యూ జనరేషన్ బాలెనో కార్ల వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. బాలెనో లోని అనేక ఫీచర్లు ఆ సెగ్మెంట్ లోని వేరే కంపెనీల కార్లలో లేకపోవడం ఈ కారుకు కలిసివచ్చింది. ఇది భారతీయ మార్కెట్‌లో మరొక బెస్ట్ సెల్లర్. బాలెనో (Maruti Suzuki Baleno) గత సంవత్సరం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ తర్వాత మూడవ స్థానంలో నిలిచింది. ఇది 2-లక్షల విక్రయాల మైలురాయికి దగ్గరివరకు వచ్చింది. తగిన ఫీచర్లు, మన్నికైన ఇంజన్‌తో కూడిన కాంపాక్ట్ మోడల్ కోసం వెతికే వారికి బాలెనో ఇష్టమైనదిగా మారింది. అంతేకాదు, ఇది 22 kmpl కంటే ఎక్కువ మైలేజీని కూడా అందిస్తుంది. మాన్యువల్, నాలుగు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరింట్స్ ఉన్నాయి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉన్న బాలెనో ధర రూ. 6.66 లక్షల నుండి రూ. 9.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇందులో సీఎన్జీ వర్షన్ కూడా ఉంది. ఇది 30 kmpl కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుంది.

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ బ్రెజా

టాటా నెక్సాన్ తో పోటీలో కొంత వెనుకబడినప్పటికీ, మారుతి బ్రెజ్జా కూడా 2023 లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUV ల్లో ఒకటిగా నిలిచింది. 2023 లో కొత్త బ్రెజ్జా అరంగేట్రం చేసింది. దాంతో, మారుతి SUV అమ్మకాలలో 30 శాతం కంటే ఎక్కువ పెరుగుదల సాధ్యమైంది.ఈ బ్రెజా SUVలో 360 డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు CNG వర్షన్ కూడా ఉంది. ఇది దాదాపు 20 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ Maruti Suzuki Brezza ఎస్ యూ వీ ధర రూ. 8.34 లక్షల నుండి రూ. 14.14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

Tata Nexon: టాటా నెక్సాన్

టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ కారు నెక్సాన్. గత కొన్ని నెలలుగా SUV సెగ్మెంట్‌లో కొనుగోలుదారులలో అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతోంది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. ఇటీవల టాటా నెక్సాన్ SUV, ఎలక్ట్రిక్ వర్షన్ ను కూడా తీసుకువచ్చారు. ఈ SUV ఇప్పుడు మునుపటి వెర్షన్‌ల కంటే ఆధునికంగా, పదునుగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌లలో లభిస్తుంది. త్వరలో టాటా నెక్సాన్ (Tata Nexon SUV) CNG వెర్షన్‌ కూడా మార్కెట్లోకి రానుంది. ఈ టాటా నెక్సాన్ SUV ధర రూ. 8.15 లక్షల నుంచి రూ. 15.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. నెక్సాన్ EV భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఇది సింగిల్ ఛార్జ్‌లో 465 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

తదుపరి వ్యాసం