Maruti Suzuki WagonR: సరికొత్తగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్.. అదిరిపోయిన లుక్
- ప్రముఖ కార్ల తయారి సంస్థ మారుతి సుజుకీ తన న్యూ అప్‌డేట్ వ్యాగన్‌ఆర్ 2022ని వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ వ్యాగన్ఆర్ పెట్రోల్ వెర్షన్‌తో ISS & AGS వేరియంట్‌లలో హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి కొన్ని ముఖ్యమైన కొత్త ఫీచర్లతో ఈ కారును రూపొందించారు.

(1 / 5)
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 2022లో రెండు కొత్త ఇంజన్‌లను ఏర్పాటు చేశారు. 1.0-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్ 1.2-లీటర్ ఇంజన్‌లను కారులో అమర్చారు.
(2 / 5)
అప్‌డెట్ WagonR పెట్రోల్ వెర్షన్‌లో ISS & AGS వేరియంట్‌లలో హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి కొన్ని ముఖ్యమైన కొత్త ఫీచర్లతో ఈ కారును తయారు చేశారు. కారులో అదనంగా, 4 స్పీకర్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్ నావిగేషన్‌తో 17.78cm (7”) స్మార్ట్‌ప్లే స్టూడియోని కూడా పొందుపర్చారు.
(3 / 5)
కొత్త మారుతి వ్యాగన్ఆర్ రెండు డ్యూయల్ టోన్ రంగులతో సహా రిఫ్రెష్ చేసిన కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. అవి బ్లాక్ రూఫ్‌తో కూడిన గ్యాలెంట్ రెడ్ , బ్లాక్ రూఫ్‌తో మాగ్మా గ్రే కలర్‌లో ఈ కారు లభిస్తుండగా.. లేత గోధుమరంగు, ముదురు బూడిద రంగులతో మెలాంజ్ సీట్ ఫాబ్రిక్‌తో వాహనాన్ని డిజైన్ చేశారు
(4 / 5)
కారులో అదనంగా కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో పాటుగా నాలుగు పవర్ విండోలను అమర్చారు. అలాగే ఏసీ, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVM వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు