తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Valentine’s Day 2023: వాట్సాప్‍కు వాలెంటైన్స్ డే స్టిక్కర్లు ఎలా యాడ్ చేసుకోవాలి?: ప్రాసెస్ ఇదే

Valentine’s Day 2023: వాట్సాప్‍కు వాలెంటైన్స్ డే స్టిక్కర్లు ఎలా యాడ్ చేసుకోవాలి?: ప్రాసెస్ ఇదే

13 February 2023, 20:42 IST

google News
    • Valentines Day 2023 - WhatsApp Stickers: మెసేజింగ్ యాప్ వాట్సాప్‍కు వాలెంటైన్స్ డే స్టిక్కర్లను యాడ్ చేసుకోవచ్చు. రకరకాలైన స్టిక్కర్లను ఇష్టమైన వారికి సెండ్ చేసుకోవచ్చు.
Valentine’s Day 2023: వాట్సాప్‍కు వాలెంటైన్స్ డే స్టిక్కర్లు ఎలా యాడ్ చేసుకోవాలి?
Valentine’s Day 2023: వాట్సాప్‍కు వాలెంటైన్స్ డే స్టిక్కర్లు ఎలా యాడ్ చేసుకోవాలి? (HT_PRINT)

Valentine’s Day 2023: వాట్సాప్‍కు వాలెంటైన్స్ డే స్టిక్కర్లు ఎలా యాడ్ చేసుకోవాలి?

Valentine’s Day 2023 - WhatsApp Stickers: ప్రేమికులకు ఎంతో ముఖ్యమైన వాలెంటైన్స్ డే (Valentines Day) సమీపించింది. రేపు (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డేను జరుపుకునేందుకు ప్రేమ జంటలు సిద్ధమయ్యాయి. అయితే, ఒకరినొకరు కలుసుకునేలోగానే మొబైల్ ద్వారానే చాలా మంది వాలెంటైన్స్ డే విషెస్ చెప్పుకునేందుకు ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా విషెస్ పంపేందుకు చాలా మంది ఇష్టపడతారు. అయితే టెక్స్ట్, ఫొటోల రూపంలో కాకుండా ఆకర్షణీయంగా స్టిక్కర్ల ద్వారా కూడా విషెస్ పంపవచ్చు. వాట్సాప్‍కు వాలెంటైన్స్ డే స్టిక్కర్లను యాడ్ చేసుకొని, ఇష్టమైన ఆకర్షణీయమైన స్టిక్కర్లను (WhatsApp Valentine’s Day Stickers) మీకు ఇష్టమైన వారికి పంపుకోవచ్చు. ఇంకాస్త ఇంప్రెస్ చేయవచ్చు. వాట్సాప్‍కు వాలెంటైన్స్ డే స్టిక్కర్లను ఎలా యాడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Valentine’s Day 2023: వాట్సాప్‍కు స్టిక్కర్లను యాడ్ చేసుకోండిలా..

  1. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‍లో గూగుల్ ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్‌లో వాలెంటైన్స్ డే స్టిక్కర్స్ (Valentine’s Day Stickers) అని టైప్ చేయండి.
  2. సెర్చ్ చేసిన తర్వాత స్టిక్కర్స్ యాప్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు ఇష్టమైన యాప్‍పై క్లిక్ చేయండి.
  3. మీరు ఎంపిక చేసుకున్న స్టిక్కర్ యాప్‍ను డౌన్‍లోడ్ చేసుకోండి. ఇన్‍స్టాల్ పూర్తయ్యాక ఆ స్టిక్కర్ యాప్‍ను ఓపెన్ చేయండి.
  4. స్టిక్కర్ యాప్‍లో మీకు నచ్చిన స్టిక్కర్లపై ట్యాప్ చేయండి. అప్పుడు యాడ్ లేదా యాడ్ టూ వాట్సాప్ అనే బటన్ కనిపిస్తుంది.
  5. యాడ్ బటన్‍పై ట్యాప్ చేస్తే.. ఆ వాలెంటైన్స్ డే స్టిక్కర్లు వాట్సాప్‍కు యాడ్ అవుతాయి.
  6. ఆ తర్వాత వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.
  7. మీరు వాలెంటైన్స్ డే స్టిక్కర్ పంపాలనుకుంటున్న వారి చాట్ ఓపెన్ చేయండి.
  8. చాట్‍లో టైప్ బాక్స్ పక్కనే ఉండే ఎమోజీ సింబల్‍పై క్లిక్ చేసి.. స్టిక్కర్ సెక్షన్‍లోకి వెళితే.. అక్కడ యాప్ ద్వారా మీరు యాడ్ చేసిన వాలెంటైన్స్ డే స్టిక్కర్లు కనిపిస్తాయి.
  9. ఇష్టమైన స్టిక్కర్‌పై ట్యాప్ చేస్తే అది సెండ్ అవుతుంది.

Valentine’s Day 2023: మరోవైపు, వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‍కార్ట్, అమెజాన్ ప్రత్యేకమైన సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ పేరుతో అమెజాన్ స్మార్ట్ ఫోన్‍లపై ఆఫర్లను ఇస్తోంది. ఫ్లిప్‍కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ నడుస్తోంది. ఈనెల 15వ తేదీ వరకు ఈ సేల్ ఉండనుంది. ఈ సేల్‍లలో పాపులర్ బ్రాండ్ల మొబైళ్లపై ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి.

తదుపరి వ్యాసం