తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Suv Cars : కాస్త పక్కకు జరగాలమ్మా.. 2025లో దూసుకొస్తున్న స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్లు, రేంజ్‌లో సూపర్

Electric SUV Cars : కాస్త పక్కకు జరగాలమ్మా.. 2025లో దూసుకొస్తున్న స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్లు, రేంజ్‌లో సూపర్

Anand Sai HT Telugu

12 December 2024, 12:30 IST

google News
    • Electric SUV Cars In 2025 : భారతీయ ఆటోమెుబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లది ప్రత్యేకమైన స్థానం. మెల్లమెల్లగా కస్టమర్లు వీటికి అలవాటుపడుతున్నారు. నిజానికి ఈవీ మార్కెట్‌ క్రమంగా పెరుగుతోంది. ఇదే అదునుగా కొన్ని కంపెనీలు 2025లో కొన్ని కార్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
టాటా హారియర్ ఈవీ
టాటా హారియర్ ఈవీ

టాటా హారియర్ ఈవీ

ఎలక్ట్రిక్ కార్లు వాడితే ఇంధనం ఖర్చు ఉండదు. కాలుష్యం సమస్య లేదు. దీంతో చాలా మంది వీటివైపే మెుగ్గుచూపుతున్నారు. కొన్ని నెలలుగా చూసుకుంటే.. భారతీయా మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లు, ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీల సేల్స్ రిపోర్ట్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ కారణంగా కంపెనీలు సైతం.. మార్కెట్‌లోకి కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. పాత ఇంధన కార్లను ఈవీలుగా మార్చి వదులుతున్నాయి. 2025 కొత్త ఏడాదిలో సైతం కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మార్కెట్‌లోకి వస్తున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఈవీ

హ్యుందాయ్ దగ్గర సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లేదు. భారతీయ మార్కెట్లో కంపెనీ త్వరలో క్రెటా ఈవీని పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న ఐసీ ఇంజిన్ క్రెటా, అల్కాజార్ నుండి డిజైన్ స్ఫూర్తిని తీసుకోనుంది. దీని అంచనా రేంజ్ దాదాపు 450 కి.మీ ఉండనుంది.

టాటా హారియర్ ఈవీ

హారియర్ ఈవీ చాలా కాలంగా లైనప్‌లో ఉంది. త్వరలో భారతీయ రోడ్లపైకి రానుంది. టాటా మోటార్స్ 2024 25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హారియర్ ఈవీని విడుదల చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇది 4X4 డ్రైవ్‌ట్రెయిన్‌తో దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఈవీ

మహీంద్రా లగ్జరీ ఎస్‌యూవీ ఆధారంగా ఎలక్ట్రిక్ కారును కూడా పరిచయం చేయడానికి రెడీ అవుతోంది. దీనిపై ఇప్పటివరకు సమచారాం ఇంకా ఇవ్వలేదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐసీ ఇంజిన్ ఎక్స్‌యూవీ700 ఆధారంగా, 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో పరిచయం అవుతుందని అంచనా.

మారుతి సుజుకి ఇ విటారా

2023 ఆటో ఎక్స్‌పోలో చూసిన మారుతి సుజుకి ఇవిఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. ఇ విటారా రూపంలో మారుతి నుండి మొదటి ఈవీ భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనున్నారు. ఇది క్రెటా ఈవీ, హారియర్ ఈవీతో సహా ఇతర వాహనాలతో పోటీపడుతుంది. దీనికి పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని అంటున్నారు. ఒక్కసారి ఛార్జ్‌పై 500 కిలో మీటర్ల వరకు రేంజ్ వస్తుంది.

తదుపరి వ్యాసం