TVS Apache RTR 160 : ఈ టీవీఎస్ అపాచీ మామూలు ఫీచర్లతో రాలేదు.. చూస్తే కుర్రాళ్లకు మతిపోవాల్సిందే!
19 November 2024, 19:00 IST
- TVS Apache RTR 160 New Features : యూత్‌లో ఎక్కువ క్రేజ్ ఉండే బైకుల్లో టీవీఎస్ అపాచీ ఒక్కటి. అపాచీలో చాలా మోడల్స్ వచ్చాయి. ఇందులో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 కూడా ఉంది. ఇప్పుడు ఈ బైక్ అప్‌డేటెడ్ ఫీచర్లతో వచ్చింది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి
ప్రముఖ ద్విచక్ర వాహనాలు టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్‌ను కొత్త ఫీచర్లు, టెక్నాలజీతో విడుదల చేసింది. ఇది అత్యాధునిక సాంకేతికత ఇంటిగ్రేషన్, అధునాతన పనితీరు, కస్టమర్లకు నచ్చేలా ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. డిజైన్‌తోపాటుగా ఇతర ఫీచర్లు కోరుకునే కుర్రాళ్లకు ఈ బైకు బెటర్ అని చెప్పవచ్చు.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి తాజా వెర్షన్ వినూత్న రైడర్-ఫ్రెండ్లీ ఫీచర్‌లతో నిండి ఉంది. టీవీఎస్ SmartXonnect టీఎం టెక్నాలజీ బ్లూటూత్ కనెక్టివిటీని అనుమతిస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్, వాయిస్ సహాయాన్ని అందిస్తుంది. గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT) సిటీ ట్రాఫిక్‌లో మంచి ప్రయాణాన్ని అందిస్తుంది.
కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్ 159.7సీసీ, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్, 4-వాల్వ్ ఇంజన్‌తో శక్తిని పొందింది. ఈ ఇంజన్ 17.55 పీఎస్ పవర్, 14.73 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మూడు విభిన్న రైడ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి స్పోర్ట్, అర్బన్, రెయిన్.
ఈ కొత్త రైడ్ మోడ్‌లు వివిధ రైడింగ్ పరిస్థితులలో మోటార్‌సైకిల్ నియంత్రణ, స్థిరత్వం, అనుకూలతను బెటర్ చేస్తాయి. ఈ ఓపెన్ హైవేలపైనా లేదా సిటీ వీధుల్లో అయినా సరిగా ప్రయాణించేందుకు బాగుంటుంది. అలాగే అడ్జస్టబుల్ బ్రేక్, క్లచ్ లివర్లు కంఫర్టబుల్‌గా ఉంటాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్ గ్రానైట్ గ్రే, మ్యాట్ బ్లాక్, పెరల్ వైట్ అనే మూడు రంగు ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ డైనమిక్ రంగులు స్పోర్టీ, రేస్-ప్రేరేపిత గ్రాఫిక్స్, గోల్డెన్-ఫినిష్ యూఎస్‌డీ ఫోర్క్స్, రెడ్ అల్లాయ్ వీల్స్‌తో వస్తాయి.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త వెర్షన్ డిజైన్ బాగుంటుందని కంపెనీ తెలిపింది. 'అధునాతన ఫీచర్లు, టెక్నాలజీతో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ అప్‌గ్రేడ్‌ను ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. పనితీరు, టెక్నాలజీ ద్వారా మా కస్టమర్ల అవసరాలను తీర్చడానికి మేం కట్టుబడి ఉన్నాం.' అని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం బిజినెస్ హెడ్ విమల్ సుంబ్లి పేర్కొన్నారు.