ఒక్క నెలలో 65 శాతం పెరుగుదల.. రాకెట్ వేగంతో దూసుకెళ్లిన స్టాక్.. నిపుణుల అంచనా ఏంటంటే
09 September 2024, 15:30 IST
- Tribhovandas Bhimji Zaveri shares : త్రిభువన్‌దాస్ భీమ్జీ జవేరి షేర్లు సోమవారం ట్రేడింగ్లో లాభాల్లో ముగిశాయి. ఈ రోజు కంపెనీ షేరు 18 శాతానికి పైగా లాభపడి రూ.275.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఒక్క నెలలో ఈ స్టాక్ ధర మంచి రాబడిని చూసింది. దీనిపై నిపుణుల అంచనా ఏంటో చూద్దాం..
ప్రతీకాత్మక చిత్రం
త్రిభువన్‌దాస్ భీమ్జీ జవేరి షేర్లు సోమవారం ట్రేడింగ్లో లాభాల్లో ముగిశాయి. కంపెనీ షేరు 18 శాతానికి పైగా లాభపడింది. రూ.275.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో దాదాపు 35 శాతం లాభపడిన ఈ షేరు నెల రోజుల్లో 65 శాతం రాబడిని చూసింది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 135 శాతం పెరిగింది.
ఇండిపెండెంట్ రీసెర్చ్ విశ్లేషకులు ఇన్వెస్టర్లు ఇప్పుడు ప్రస్తుత స్థాయిలో లాభాలను నమోదు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే దాని ఆర్ఎస్ఐ 84 వద్ద ఉంది. రూ.241 మద్దతు స్థాయి కంటే దిగువన రోజువారీ క్లోజ్ చేస్తే రాబోయే వారాల్లో రూ.179కి పడిపోవచ్చు. 52 వారాల గరిష్ట ధర రూ.275.90, 52 వారాల కనిష్ట ధర రూ.93.60గా ఉంది. దీని మార్కెట్ క్యాప్ రూ.1,817.41 కోట్లు.
ధరలు పెరుగుతున్నప్పటికీ బంగారు ఆభరణాలకు బలమైన డిమాండ్ ఉండటంతో త్రిభువన్‌దాస్ భీమ్జీ జవేరి మొదటి త్రైమాసికంలో లాభంలో 50 శాతం పెరుగుదలను నమోదు చేసింది. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.17.05 కోట్లకు, అమ్మకాలు 4.5 శాతం పెరిగి రూ.596 కోట్లకు చేరాయి.
అధిక మార్జిన్ వస్తువులపై దృష్టి పెట్టడంతో కంపెనీ లాభాల మార్జిన్ 5.65 శాతం నుంచి 7.14 శాతానికి పెరిగింది. త్రిభువన్‌దాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్ జూలై 24, 2007న స్థాపించిన లిస్టెడ్ కంపెనీ. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా వర్గీకరించారు. ఇది మహారాష్ట్రలోని ముంబయి కేంద్రంగా పనిచేస్తుంది.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం బ్రోకరేజీ సంస్థపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.