IPO news: పట్టుమని 10 మంది ఉద్యోగులు లేరు; కానీ ఈ కంపెనీ ఐపీఓ కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు; ఎందుకలా?-inside a tiny bike dealer in delhi thats now toast of indian ipos ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ipo News: పట్టుమని 10 మంది ఉద్యోగులు లేరు; కానీ ఈ కంపెనీ ఐపీఓ కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు; ఎందుకలా?

IPO news: పట్టుమని 10 మంది ఉద్యోగులు లేరు; కానీ ఈ కంపెనీ ఐపీఓ కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు; ఎందుకలా?

HT Telugu Desk HT Telugu
Aug 27, 2024 07:12 PM IST

IPO news: ఆ కంపెనీలో పట్టుమని 10 మంది ఉద్యోగులు లేరు. ఆ సంస్థకు ఉన్నదల్లా ఢిల్లీలో రెండు యమహా షో రూమ్స్ మాత్రమే. అందులోనూ ఒకటి నష్టాల్లో ఉంది. వాటితో పాటు హిమాచల్ ప్రదేశ్ లో ఒక వాటర్ ప్లాంట్ ఉందట. ఆ సంస్థ ఇటీవలే ఐపీఓకు వచ్చింది. ఈ ఐపీఓకు అందరూ ఆశ్చర్యపోయేలా 400 రెట్లు సబ్ స్క్రిప్షన్ లభించింది.

ఈ కంపెనీ ఐపీఓ కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు
ఈ కంపెనీ ఐపీఓ కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు (HT Auto)

IPO news: సాహ్ని ఆటోమొబైల్స్ పేరుతో రిసోర్స్ ఫుల్ ఆటో మొబైల్ సంస్థ ఢిల్లీలో రెండు యమహా షోరూమ్స్ ను నిర్వహిస్తోంది. యమహా బైక్స్, స్కూటర్స్ సేల్స్ అండ్ సర్వీస్ వీటి ప్రధాన వ్యాపారం. ఇది దేశంలోనే అతి పెద్ద యమహా షో రూమ్ కాదు. సేల్స్ అంతంతమాత్రమే. అయితే, దేశ రాజధానిలోని అత్యంత ప్రముఖ ప్రాంతంలో ఈ రెండు బైక్ అవుట్ లెట్ లు ఉన్నాయి.

ఐపీఓ..

ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రిసోర్స్ ఫుల్ ఆటో మొబైల్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కేటగిరీలో వచ్చిన ఈ ఐపీఓకు ఏకంగా 400 రెట్లు సబ్ స్క్రిప్షన్ లభించింది. ఈ ఐపీఓ తొలి రోజు 10.35 రెట్లు, రెండో రోజు 74.13 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. చివరి రోజైన సోమవారం నాటికి ఈ సంఖ్య దాదాపు 419 రెట్లు పెరిగింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. అందుబాటులో ఉన్న 10.24 లక్షల షేర్లకు 40 కోట్లకు పైగా బిడ్స్ వచ్చాయి. ఈ ఎస్ఎంఈ ఐపీఓలో ఒక్కో షేరుకు రూ.117 చొప్పున ప్రైస్ బ్యాండ్ నిర్ణయించారు.

ఎందుకు అంత రెస్పాన్స్?

ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి ఎందుకు అంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసుకోవడానికి హిందుస్తాన్ టైమ్స్ ఆటో టీమ్ సాహ్ని ఆటోమొబైల్ షోరూమ్ లను సందర్శించింది. వాటిలో ఒకటి ద్వారకాలో ఉండగా, మరొకటి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహావీర్ ఎన్ క్లేవ్ లో ఉంది. మహావీర్ ఎన్ క్లేవ్ షోరూమ్ లో కేవలం నలుగురు ఉద్యోగులు ఉండగా, ద్వారకా సెక్టార్ 3 షోరూమ్ లో 41 మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది. అయితే వీరిలో షోరూం సమీపంలో ఉన్న గోదాము, సర్వీస్ వర్క్ షాప్ లోని వర్కర్స్ కూడా ఉన్నారు.

సేల్స్ అంతంత మాత్రమే..

ద్వారకా సెక్టార్ 3లోని రాజపురి రోడ్డులో ఉన్న బ్లూ స్క్వేర్ షోరూమ్ అని పిలువబడే ప్రధాన సాహ్ని ఆటోమొబైల్ షోరూమ్ లో మంగళవారం మధ్యాహ్నానికి కూడా పెద్దగా సందడి కనిపించలేదు. షోరూమ్ లో యమహా ఆర్ 15ఎమ్ నుండి యమహా ఫాసినో వరకు 15 మోడల్స్ ఉన్నాయి. అయితే ఇటీవల లాంచ్ చేసిన ఫ్లాగ్ షిప్ మోటార్ సైకిళ్లు ఆర్ 3, ఎంటీ-03 మోడల్స్ ఇక్కడ లేవు. బేస్ మెంట్ లో ఉన్న గోదాములో మరికొన్ని ద్విచక్ర వాహనాలు ఉండగా, వర్క్ షాప్ ప్రధాన షోరూమ్ కు కొన్ని మీటర్ల దూరంలో ఉంది. కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న మహావీర్ ఎన్ క్లేవ్ లోని మరో సాహ్నీ ఆటోమొబైల్ డీలర్ షిప్ ను కూడా చూడాలని టీమ్ హెచ్ టి ఆటో నిర్ణయించింది. ఇక్కడ కూడా పెద్దగా కస్టమర్ల సందడి లేదు. సంస్థ ఐపీఓ గురించి స్టాఫ్ ను, స్టోర్ మేనేజర్ ను అడిగాం. వారు తమకేం తెలియదని సమాధానమిచ్చారు. మహావీర్ ఎన్ క్లేవ్ షోరూమ్ మరీ దారుణంగా ఉంది. కూలిపోయిన గోడలు, దాదాపు చిరిగిపోయిన 'యమహా' పోస్టర్లు కనిపించాయి. కేవలం నలుగురు ఉద్యోగులు మాత్రమే కనిపించారు. సాహ్ని ఆటోమొబైల్స్ పరిధిలోని రెండు యమహా షోరూమ్ లలో ఇది కొత్తదని, గత ఏడాది ప్రారంభమైందని ఇక్కడి స్టోర్ మేనేజర్ చెప్పడంతో, టీం హెచ్ టీ ఆటో ఆశ్చర్యపోయింది.

2018 లోనే స్థాపన

రిసోర్స్ ఫుల్ ఆటోమొబైల్ సంస్థ ను 2018 లో రాహుల్ సాహ్ని ప్రారంభించారు. ఇది కమ్యూటర్ బైక్స్ నుంచి నుండి స్పోర్ట్స్ బైక్స్ వరకు అన్ని యమహా ఉత్పత్తుల సేల్స్, సర్వీస్ అందిస్తుంది. యమహా బ్రాండెడ్ యాక్సెసరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రస్తుత రుణాన్ని తిరిగి చెల్లించడమే కాకుండా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అదనపు షోరూమ లను తెరవాలని ఆటోమొబైల్ భావిస్తున్నట్లు సమాచారం.

నష్టాల్లో షో రూమ్స్..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మూడేళ్ల క్రితం వరకు ఢిల్లీలో ఈ సంస్థకు నాలుగు యమహా షోరూమ్స్ ఉన్నాయి. భారీగా నష్టాలు రావడంతో వాటిలో కొన్ని షోరూమ్ లను మూసివేశారు. రాజౌరీ గార్డెన్ లో ఉన్న షోరూమ్ లో రూ.కోటి వరకు నష్టం వచ్చిందని సంస్థ ఉద్యోగి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2 షో రూమ్స్ లో ద్వారకా సెక్టార్ 3 షోరూం మాత్రమే ప్రస్తుతానికి లాభదాయకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు షోరూమ్ లతో పాటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా రాహుల్ సాహ్నికి వాటర్ ప్లాంట్ ఉందని ద్వారకా షోరూమ్ లోని ఉద్యోగి వెల్లడించాడు.