తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rumion Vs Ertiga : సేమ్​ సేమ్​ బట్​ డిఫరెంట్​.. రుమియన్​- ఎర్టిగాల్లో తేడా ఏంటి? ఏది కొనాలి?

Rumion vs Ertiga : సేమ్​ సేమ్​ బట్​ డిఫరెంట్​.. రుమియన్​- ఎర్టిగాల్లో తేడా ఏంటి? ఏది కొనాలి?

Sharath Chitturi HT Telugu

29 August 2023, 12:05 IST

    • Toyota Rumion vs Maruti Suzuki Ertiga : టయోటా రుమియన్​, మారుతీ సుజుకీ ఎర్టిగాల మధ్య తేడా ఏంటి? ఇక్కడ తెలుసుకుందాము..
రుమియన్​- ఎర్టిగాల్లో తేడా ఏంటి? ఏది కొనాలి?
రుమియన్​- ఎర్టిగాల్లో తేడా ఏంటి? ఏది కొనాలి?

రుమియన్​- ఎర్టిగాల్లో తేడా ఏంటి? ఏది కొనాలి?

Toyota Rumion vs Maruti Suzuki Ertiga : టయోటా రుమియన్​ని తాజాగా ఇండియాలో లాంచ్​ చేసింది జపాన్​కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇది.. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా రూపొందించిన ఏంపీవీ అన్న విషయం తెలిసిందే. అయితే రెండింట్లోనూ కొన్ని మార్పులు ఉన్నాయి. వాటిని పరిశీలించి, ఈ రెండు వెహికిల్స్​లో ఏది కొనాలి? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

రెండు వెహికిల్స్​లో కనిపించే మార్పులు ఇవే..

రుమియన్​- ఎర్టిగాలను చూస్తే.. ముందుగా కనిపించే డిఫరెన్స్​.. ఫ్రెంట్​ గ్రిల్​. రుమియన్​ ఫ్రెంట్​ గ్రిల్​లో మార్పులు చేసింది టయోటా సంస్థ. ఇందులో క్రోమ్​ సరౌండింగ్​తో కూడిన మెష్​ పాటర్న్​ గ్రిల్​ వస్తోంది. మారుతీ సుజుకీ ఎర్టిగా ఫ్రెంట్​ గ్రిల్​ సెంటర్​లో క్రోమ్​ ట్రిమ్స్​ వస్తాయి.

Toyota Rumion on road price Hyderabad : ఇక రుమియన్​ ఫ్రెంట్​ బంపర్​ను పూర్తిగా మార్చేసింది టయోటా సంస్థ. ఇందులో బ్రష్డ్​ అల్యుమీనియం ఇన్​సర్ట్స్​ వస్తున్నాయి. ఫాగ్​ ల్యాంప్​ హౌజింగ్​ కూడా డిఫరెంట్​గా ఉంటుంది.

రుమియన్​- ఎర్టిగాల్లో 15 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. కాకపోతే.. రుమియన్ వీల్స్​ డిజైన్​లో మార్పు కనిపిస్తుంది. ఇవి చాలా స్టైలిష్​గా ఉన్నాయి.

ఇదీ చూడండి:- Toyota Rumion vs Kia Carens : రుమియన్​ వర్సెస్​ క్యారెన్స్​.. ఏది బెస్ట్​?

Maruti Suzuki Ertiga on road price Hyderabad : మారుతీ సుజుకీ ఎర్టిగాలో 7 కలర్​ ఆప్షన్స్​ ఉంటాయి. అవి.. డిగ్నిటీ బ్రౌన్​, మాగ్మా గ్రే, ఆక్స్​ఫర్డ్​ బ్లూ, ఔబర్న్​ రెడ్​, స్పెండిడ్​ సిల్వర్​, ఆర్కెటిక్​ వైట్​, మిడ్​నైట్​ బ్లాక్​. ఇక రుమియన్​లో కేవలం 5 కలర్​ ఆప్షన్స్​ వస్తున్నాయి. అవి స్పంకీ బ్లూ, రస్టిక్​ బ్రౌన్​, ఐకానిక్​ గ్రే, కేఫ్​ వైట్​, ఎంటైసింగ్​ సిల్వర్​.

ఇక కేబిన్​ విషయానికొస్తే.. టయోటా రుమియన్​లో గ్రే షేడ్స్​ వస్తున్నాయి. ఎర్టిగాలో డ్యూయెల్​ టోన్​ (బైగ్​- బ్లాక్​) రంగు ఉంటుంది. వీటికి మంచి.. ఇంటీరియర్​లో రెండు వాహనాల్లో పెద్దగా మార్పులు ఉండవు. ఈ రెండు ఎంపీవీల్లో వాడే ఇంజిన్​ ఒకటే!

టయోటా రుమియన్​ వేరియంట్లు- వాటి ధరలు..

Toyota Rumion MPV price in India : రుమియన్​లో మొత్తం 6 వేరియంట్లు ఉన్నాయి.

ఎస్​ ఎంటీ (పెట్రోల్​)- రూ. 10.29లక్షలు

ఎస్​ ఏటీ (పెట్రోల్​)- రూ. 11.89లక్షలు

జీ ఎంటీ (పెట్రోల్​)- రూ. 11.45లక్షలు

వీ ఎంటీ (పెట్రోల్​)- రూ. 12.18లక్షలు

వీ ఏటీ (పెట్రోల్​)- రూ. 13.68లక్షలు

ఎస్​ ఎంటీ (సీఎన్​జీ)- రూ. 11.24లక్షలు

హైదరాబాద్​లో రుమియన్​ ఆన్​రోడ్​ ప్రైజ్​కు సంబంధించిన వివరాలపై ఇంకా క్లారిటీ లేదు.

తదుపరి వ్యాసం