Toyota Rumion MPV : టయోటా రుమియన్ ఎంపీవీ లాంచ్.. ధర ఎంతంటే..!
Toyota Rumion MPV : టయోటా రుమియన్ ఎంపీవీ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ వెహికిల్ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Toyota Rumion MPV launched : టయోటా రుమియన్ ఎంపీవీ.. అధికారికంగా ఇండియాలో లాంచ్ అయ్యింది. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా ఈ వెహికిల్‌ను టయోటా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మోడల్ బుకింగ్స్ తాజాగా ఓపెన్ అయ్యాయి. రూ. 11వేల టోకెన్ అమౌంట్‌తో ఈ వెహికిల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్ ధర, ఫీచర్స్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
ట్రెండింగ్ వార్తలు
కొత్త ఎంపీవీ హైలైట్స్ ఇవే..
ఎంపీవీ సెగ్మెంట్లో.. టయోటా ఇన్నోవా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఇక మారుతీ సుజుకీ ఎర్టిగాకు కూడా మంచి డిమాండ్ లభిస్తోంది. ఇక.. రెండు సంస్థల మధ్య ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యం నేపథ్యంలో రుమియన్‌ను తీసుకొచ్చింది టయోటా. అయితే ఇది కొత్తేమీ కాదు. మారుతీ సుజుకీ బలెనోను గ్లాంజాగా, గ్రాండ్ విటారాను అర్బన్ క్రూజ్ హైరైడర్‌గా ఇండియాలో లాంచ్ చేసింది. వీటిని తయారు చేసిన ప్లాట్‌ఫామ్ ఒకటే. కాకాపోతే కొన్ని ఫీచర్స్, ఇంజిన్‌లో కాస్త మార్పులు కనిపిస్తాయి.
ఎంపీవీ సెగ్మెంట్లో ఇన్నోవాతో పాటు మరో వెహికిల్తో సేల్స్‌ను పెంచుకోవాలని జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోటా భావించింది. అందుకే ఈ రుమియన్‌ను లాంచ్ చేసింది. ఇక ఈ 7 సీటర్ వెహికిల్‌లో 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీని మైలేజ్ 20.51 కేఎంపీహఎల్. ఈ ఇంజిన్. 101 బీహెచ్పీ పవర్‌ను, 136.8 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మోడల్లో సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. దీని మైలేజ్ 26.11 కేఎం/కేజీ.
టయోటా రుమియన్ వేరియంట్లు- వాటి ధరలు (ఎక్స్‌షోరూం)..
Toyota Rumion MPV price in India : రుమియన్‌లో మొత్తం 6 వేరియంట్లు ఉన్నాయి.
ఎస్ ఎంటీ (పెట్రోల్)- రూ. 10.29లక్షలు
ఎస్ ఏటీ (పెట్రోల్)- రూ. 11.89లక్షలు
జీ ఎంటీ (పెట్రోల్)- రూ. 11.45లక్షలు
వీ ఎంటీ (పెట్రోల్)- రూ. 12.18లక్షలు
వీ ఏటీ (పెట్రోల్)- రూ. 13.68లక్షలు
ఎస్ ఎంటీ (సీఎన్జీ)- రూ. 11.24లక్షలు
హైదరాబాద్‌లో టయోటా రుమియన్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
Toyota Rumion MPV bookings : మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా రూపొందించిన ఈ టయోటా రుమియన్ ఎంపీవీ.. కియా క్యారెన్స్కు గట్టిపోటీనిస్తుంది. సెప్టెంబర్ 8 నుంచి ఈ మోడల్ డెలివరీలు మొదలవుతాయని సంస్థ చెప్పింది.
సంబంధిత కథనం