Toyota Innova EV : ఇన్నోవా ‘ఈవీ’ వర్షెన్ లాంచ్‌కు టయోటా ప్లాన్స్..!
02 December 2022, 7:17 IST
- Toyota Innova EV : ఇన్నోవాకు ఈవీ వర్షెన్‌ను తీసుకొచ్చే ప్లాన్స్‌లో టయోటా సంస్థ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వెహికిల్.. టెస్టింగ్ దశలో ఉన్నట్టు సమాచారం.
టయోటా ఇన్నోవా ఈవీ..
Toyota Innova EV : టయోటా సంస్థ జోరు మీద ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్నోవా హైక్రాస్‌ను ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు మరో మోడల్‌పై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఇన్నోవాకు ఈవీ వర్షెన్ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ టయోటా ఇన్నోవా ఈవీ.. ఇండోనేషియాలో ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇన్నోవా ఈవీ.. సూపర్!
టయోటా ఇన్నోవా ఈవీగా భావిస్తున్న ఓ ఫొటో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఇన్నోవా మోడల్లో క్లోజ్డ్ గ్రిల్‌తో హెడ్‌ల్యాంప్ యూనిట్స్ కనిపిస్తున్నాయి. పాత ఇన్నోవా క్రిస్టా మోడల్‌తో ఇది పోలి ఉండటం విశేషం. ఇక ఈ వెహికిల్ రేర్‌లో.. 'ఇన్నోవా ఈవీ' అనే బ్యాడ్జ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
Toyota Innova EV first look : ఈ స్పై ఫొటోలో.. ఇన్నోవా ఈవీలో వర్టికల్ ఫాగ్ ల్యాంప్ కేసింగ్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. సైడ్స్‌లో అలోయ్ వీల్స్, బ్లూ గ్రాఫిక్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇన్నోవా ఈవీ ఇంటీరియర్.. ఐసీఈ వర్షెన్‌తో పోలి ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 3 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉండనున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో.. ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ మోటార్ షోలో.. ఇన్నోవా ఈవీ కాన్సెప్ట్‌ను బయటపెట్టింది టయోటా. ఇందులోని ఇన్ఫోటైన్మెంట్ స్క్రీప్‌పై బ్యాటరీ లెవల్, రేంజ్- పవర్ ఔట్పుట్ వంటి వివరాలు కనిపిస్తాయి.
ఇన్నోవాను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది టయోటా సంస్థ. ఇది పెట్రోల్, లేదా డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇక ఇన్నోవాకు హైబ్రీడ్ వేరియంట్‌ను ఇటీవలే ఇండియాలోనూ లాంచ్ చేసింది టయోటా. ఇక ఇన్నోవా ఎలక్ట్రిక్ వర్షెన్ కూడా వస్తే.. సంస్థకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. ఇన్నోవా సీఎన్జీ వర్షెన్ కూడా త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్..
Toyota Innova HyCross : ఆటోమొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. గత నెల 25న ఇండియాలో లాంచ్ అయ్యింది. దీనితో పాటు.. బుకింగ్స్‌ని కూడా మొదలుపెట్టింది టయోటా సంస్థ. 2023 జనవరి మధ్య వారంలో నుంచి డెలివరీలు మొదలుపెడతామని స్పష్టం చేసింది. ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా జెనిక్స్ పేరుతో ఇండోనేషియా మార్కెట్లో లాంచ్ అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.