తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top Scooters : 110 సీసీలో టాప్ స్కూటర్లు.. ధర తక్కువ, మైలేజీ ఎక్కువ.. ఇందులో మీకు నచ్చే స్కూటీ ఏది?

Top Scooters : 110 సీసీలో టాప్ స్కూటర్లు.. ధర తక్కువ, మైలేజీ ఎక్కువ.. ఇందులో మీకు నచ్చే స్కూటీ ఏది?

Anand Sai HT Telugu

31 October 2024, 6:00 IST

google News
    • 110 CC Top Scooters : ఇటీవలి కాలంలో స్కూటీల వాడకం పెరిగింది. ఇటు మహిళలకు, అటు పురుషులకు ఇవి ఉపయోగపడుతున్నాయి. 110 సీసీలో టాప్ స్కూటర్లు ఏమున్నాయో చూద్దాం..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం కచ్చితంగా బైక్ తప్పనిసరి అయిపోయింది. ఇంటికో ద్విచక్రవాహనం ఉన్నట్టుగా ఉంది. కొందరికి బైక్స్ నచ్చితే, మరికొందరికి స్కూటర్లు అంటే ఇష్టం. బైక్‌లు, స్కూటర్లలో ఏదైనా కొనడం మంచిదనే ఆలోచన చాలా మందిలో ఉంది. మోటార్ సైకిళ్లతో పోలిస్తే స్కూటీలు గేర్‌లెస్.. స్త్రీలు, పురుషులకు ఉపయోగపడతాయి. అయితే తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే 110 సీసీ కేటగిరీలో ఉన్న స్కూటర్లను చూద్దాం..

హోండా యాక్టివా 6జీ స్కూటర్ రూ.79,624 నుండి రూ.84,624 ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 7.79 పీఎస్ హార్స్ పవర్, 8.84 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 109.51 సీసీ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. హోండా యాక్టివా స్కూటర్ గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. లీటరుకు 59.5 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ అండ్ పెర్ల్ ప్రెషియస్ వైట్‌తో సహా వివిధ రంగులలో దొరుకుతుంది. ఈ స్కూటీలో చాలా ఫీచర్లు ఉన్నాయి.

హోండా డియో కూడా ఒక మంచి స్కూటర్. దీని ధర రూ.75,630 నుంచి రూ.82,580గా ఉంటుంది. ఇది 8000 ఆర్పీఎమ్ వద్ద 7.85 పీఎస్ హార్స్ పవర్, 5250 ఆర్పీఎమ్ వద్ద 9.03 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ స్కూటీ 109.51 సీసీతో వస్తుంది. లీటరుకు 50 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్ రూ.72,614 నుండి రూ.73,417 ధరతో ఉంది. ఇందులో 109.7 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 7500 ఆర్పీఎమ్ వద్ద 7.8 PS హార్స్ పవర్, 8.84 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 48 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. కొత్త టీవీఎస్ స్కూటీ జెస్ట్ మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ పర్పుల్, మ్యాట్ రెడ్ వంటి వివిధ ఆప్షన్స్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని బరువు 103 కిలోలు, 5-లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది.

హీరో జూమ్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ రూ.75,761 నుండి రూ. 85,400 వరకు వస్తుంది. ఇందులో 110.9 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 7250 ఆర్పీఎమ్ వద్ద 8.15 PS హార్స్ పవర్, 5750 ఆర్పీఎమ్ వద్ద 8.7 ఎన్ఎణ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో మీకు ఏది ఇష్టమో సెలక్ట్ చేసుకుని తీసుకుండి.

హీరో ప్లెజర్ ప్లస్ స్కూటీ కూడా బాగుంటుంది. దీని ధర రూ. 72,163 నుండి రూ. 83,918 ఎక్స్-షోరూమ్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 110.9 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇది 50 కిలో మీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఇది ఎల్‌సీడీ స్క్రీన్‌తో సహా పలు ఫీచర్లను పొందుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం